
దేశంలో పొదుపు చేయాలని భావించే చాలామంది ఎటువంటి రిస్క్ లేకుండా అదిరిపోయే లాభాలను ఇచ్చే స్కీమ్ ల కోసం ఎదురు చూస్తున్నారు. బ్యాంకులు, పోస్టాఫీస్ లు రిస్క్ లేకుండా డబ్బులను డిపాజిట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అలా పోస్టాఫీస్ కల్పిస్తున్న స్కీమ్ లలో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ లో చేరడం ద్వారా అనేక ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు.
సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ద్వారా మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. కనీసం 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ లో సులభంగా చేరవచ్చు. అయితే తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ లో ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి కనీసం 4.5 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది.
జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చేసిన వాళ్లు గరిష్టంగా 9 లక్షల రూపాయలు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్లు, రిటైర్ అయిన ఉద్యోగులు ఈ స్కీమ్ లో ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా డబ్బులు పొందవచ్చు. జాయింట్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేసి రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా 5 వేల రూపాయలు వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం పోస్టాఫీస్ లు ఈ స్కీమ్ పై 6.6 శాతం వడ్డీని ఇస్తున్నాయి. ఈ స్కీమ్ లో చేరిన ఐదు సంవత్సరాల తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. అంతవరకు ఈ స్కీమ్ ద్వారా వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ కు వెళ్లి ఐడీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూప్ లను సమర్పించి ఈ స్కీమ్ లో చేరి ప్రతి నెలా డబ్బులను పొందవచ్చు.