Poco x8 Pro: ప్రముఖ మొబైల్ కంపెనీ POCO త్వరలో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. ఈ కంపెనీకి చెందిన ఫోన్లో బడ్జెట్‌కు అనుగుణంగా ఉంటాయని చాలామంది భావన. అందుకే దీని నుంచి ఎటువంటి సమాచారం మార్కెట్లోకి వచ్చిన ఆసక్తి చూపుతుంటారు. అయితే లేటెస్ట్ గా ఈ కంపెనీ POCO X8 Pro అనే మొబైల్ ను తన అధికారిక వెబ్సైట్లో ప్రదర్శించారు. ఇది మార్కెట్లోకి రాకముందే దీని గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కంపెనీ తెలిపిన వివరాలను చూస్తే ఆకట్టుకునే డిస్ప్లే తో పాటు కెమెరా పనితీరు మెరుగ్గా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
దక్షిణ కొరియా కంపెనీ అయిన POCO త్వరలో X8 Pro అనే మొబైల్ ను లాంచ్ చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల డిస్ప్లే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది గతంలో విడుదలైన 8 ప్రో కంటే తక్కువగా ఉన్నప్పటికీ దీని బ్రైటెస్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గేమింగ్ కోరుకునే వారితోపాటు నెట్‌ఫ్లిక్స్ వంటి సినిమాలు చూసేవారికి ఈ డిస్ప్లే అనుకూలంగా ఉండండి. అంతేకాకుండా ఈ మొబైల్ చేతిలో పట్టుకునేందుకు అనుగుణంగా ఉండడంతో చూడడానికి ఆకర్షణీయంగా ఉండనుంది. ఇందులో మెరుగైన బ్యాటరీని చేర్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ బ్యాటరీ 100 W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయనుంది. అలాగే ఈ మొబైల్లో మీడియా టెక్ dimensity 8500 chip set తో పనిచేస్తుంది.
ఈ మొబైల్ ఇప్పటికే మార్కెట్లోకి రెడ్ మి టర్బో 5 యొక్క రీ బ్రాండ్ వెర్షన్ గా పేర్కొంటున్నారు. అయితేPOCO X8 Pro మొబైల్ లో 12 GB రామ్ ఉండనుంది. స్టోరేజ్ కోసం 512 జిబి చేర్చారు. దీంతో ఫోటోలు, వీడియోలు కావలసినవన్నీ స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి మెరుగైన కెమెరా కూడా ఉండడంతో నేటి తరం వారికి అనుగుణంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన పోకో ఎక్స్ 8 ప్రో మొబైల్ లో 50 MP మెయిన్ కెమెరా ఉంది. ఇది 8 MP ఆల్రెడీ కెమెరాను కలిగి ఉండడంతో.. ఇంచుమించు ఇదే కెమెరాను కొత్తగా మార్కెట్లోకి వచ్చేX8 Pro ఫోన్లో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ గురించి అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం రూ.43,000 ధర ఉంటుందని తెలుస్తోంది. రామ్ తోపాటు స్టోరేజ్ కెపాసిటీ పెరిగిన నేపథ్యంలో ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆకర్షనీయంగా ఉండే తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.