POCO X 8 Pro: ప్రముఖ మొబైల్ కంపెనీ POCO భారతదేశంలో తన కొత్త ప్రోడక్ట్లను విస్తరించడానికి సిద్ధమవుతుంది.. దీని నుంచి త్వరలో POCO X 8 Pro, POCO X 8 pro అనే రెండు మొబైల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కొన్ని రకాల సూచనలు బట్టి ఈ కంపెనీ రెండు మొబైల్స్ ను మార్చి మధ్యలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మొబైల్స్ ఇప్పటివరకు వచ్చిన వాటికంటే విభిన్నంగా ఉంటూ.. మెరుగైన పనితీరును కనబరిచే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో కెమెరా, బ్యాటరీ వ్యవస్థ ఆఫ్ గ్రేడ్ ఉంటుందని చెబుతున్నారు. వీటి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
POCO X 8 Pro అనే మొబైల్ 6.59 అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 1.5 K resolution తో పని చేసే ఈ డిస్ప్లే 8500 nits బ్రైట్నెస్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతో మూవీస్ చూసే వారితో పాటు గేమింగ్ కోరుకునే వారికి ఈ మొబైల్ అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా వాతావరణం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఇందులో నుంచి వచ్చే కాంతి సమర్థవంతంగా ఉంటుంది. ఈ మొబైల్ లో కెమెరా పనితీరు కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరాతో లాంగ్ షాట్స్ కూడా జూన్ చేసినా కూడా ఎలాంటి క్వాలిటీ తగ్గకుండా ఉంటుంది. అలాగే 20 MP సెల్ఫీ కెమెరా కూడా ఉండనుంది. ఇది వీడియో కాలింగ్ కు కూడా అనుగుణంగా పనిచేస్తుంది.
Also Read: ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. One Plus నుంచి అద్భుతమైన మొబైల్.. ధర ఎంతంటే?
బ్యాటరీ వ్యవస్థలోనూ ఈ మొబైల్ మెరుగ్గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో 6,500 mAh ఉండే అవకాశం ఉంది. ఇది 100 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పని చేస్తుంది. వైర్డ్, వైర్లెస్ చార్జింగ్తో పనిచేయడం వల్ల రోజంతా వినియోగించేవారికి.. బిజీగా ఉండే వారికి వెంటనే చార్జింగ్ కావాలని అనుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది.
అలాగే POCO X 8 Pro Max మొబైల్ లో డిస్ప్లే మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఇందులో 6.83 అంగుళాల OLED డిస్ప్లే ఉంది. ఇది 1.5 k resolution తో పని చేస్తుంది. ఇది 9500 nits బ్రైట్నెస్ తో ఉండడంవల్ల ఎలాంటి వాతావరణం లోనైనా సరైన కాంతి కనిపిస్తుంది. ఈ మొబైల్లో 50 MP మెయిన్ కెమెరా ఉండగా..8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. ఇందులో 8,500 mAh బ్యాటరీ ఉండడంతో రోజంతా వినియోగించినా చార్జింగ్ తక్కువగా డౌన్ టైం ఉండే అవకాశం ఉంది.