యూపీఐ చెల్లింపులతో జేబుకు చిల్లు.. ఎలాగో తెలుసా?

ప్రస్తుతం ఫోన్ ఫే , గూగుల్ పే ద్వారా చెల్లింపు చేయడం ద్వారా మినిమిం ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ కు అలవాటు పడిన వారు ఇప్పుడు దానిని మానుకోవడం లేదు. పైగా రూపాయి,రెండు రూపాయలే కదా.. అని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా చాలా వరకు నిర్లక్ష్యంగా ఉండి ఎక్కువ మొత్తంలో నష్టపోతున్నారు.

Written By: Chai Muchhata, Updated On : May 14, 2024 2:22 pm
Follow us on

నేటి కాలంలో నగదు వ్యవహారంలో అంతా డిజిటల్ మయం అయింది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు చేతిలో ఉన్న మొబైల్ తో చెల్లించడం సులభతరం అయింది. ఒకప్పుడు ఏ వస్తువు కొనుగోలు చేయాలనుకున్నా వెంట డబ్బు తీసుకెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు కేవలం మొబైల్ ఉంటే చాలు.. ఎంత పెద్ద మొత్తం అయినా.. మొబైల్ నుంచి పంపించవచ్చు. అయితే ఇలా మనీ ట్రాన్స్ ఫర్ చేయడం చాలా సులభరతరం అనిపించినా వీటి ద్వారా వినియోగదారుడి జేబుకు చిల్లులు పడుతున్నాయని కొందరు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అదెలాగో చూద్దాం..

మొబైల్ నుంచి మనీ ట్రాన్స్ ఫర్ కు ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ లు ప్రముఖంగా ఉన్నాయి. మొన్నటి వరకు పేటీఎం ఉండేది. కానీ ఆర్బీఐ ఆంక్షల వల్ల దీని వినియోగం తగ్గిపోయంది.ఈ నేపథ్యంలో గూగుల్ పే, ఫోన్ పే ట్రాన్సాక్షన్లు విపరీతంగా పెరిగాయి. కిరాణం షాపు నుంచి షాపింగ్ మాల్ కు వెళ్లే ప్రతి ఒక్కరూ నేటి కాలంలో యూపీఐ ద్వారా నే చెల్లిస్తున్నారు. కానీ డబ్బులు చెల్లించే సమయంలో కొందరు కొన్ని విషయాలపు పూర్తిగా మరిచిపోతున్నారు. దీంతో భారీగా నష్టపోతున్నారు.

ప్రస్తుతం ఫోన్ ఫే , గూగుల్ పే ద్వారా చెల్లింపు చేయడం ద్వారా మినిమిం ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ కు అలవాటు పడిన వారు ఇప్పుడు దానిని మానుకోవడం లేదు. పైగా రూపాయి,రెండు రూపాయలే కదా.. అని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా చాలా వరకు నిర్లక్ష్యంగా ఉండి ఎక్కువ మొత్తంలో నష్టపోతున్నారు. ఈ విధంగా మనం చేసే ట్రాన్జాక్షన్లో మనకు తెలియకుండానే చాలా వరకు కోల్పోతున్నాం. అదే చేతితో డబ్బులు తీసుకెళ్లడం ద్వారా వీటిని సేవ్ చేసుకోగలుగుతాం.

యూపీఐ ద్వారా చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. చాలా మంది ఖర్చులు పెరిగిపోయాయి. ముఖ్యంగా కొన్ని ఆకర్షణీయమైన వస్తువుల కనిపిస్తే ఒకప్పుడు డబ్బులు లేవని ఊరుకునేవాళ్లం. ఆ తరువాత ఆ వస్తువు గురించి మరిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు చేతిలో డబ్బులు ఉండడం వల్ల స్వైప్ చేసి వెంటనే ఆ వస్తువులు కొంటున్నాం. ఇలా చాలా వరకు అసవరం లేని వస్తువులే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది.

లేటేస్టుగా చేసిన కొన్ని అధ్యయనాల వల్ల భారతదేశంలోని ప్రజలు 81 శాతం మంచి యూపీఐని వినియోగిస్తూ 75 శాతం అనవసరమైన ఖర్చులు చేస్తున్నట్లు తేలింది. చేతిలో మొబైల్ ఉందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ రూ.200 ఖర్చు చేస్తున్నారు. దీంతో వీటి లావాదేవీల ప్రకారం రూ.1,330 కోట్ల కు చేరుకున్నట్లు తేలింది. ప్రతీ ఏడాదిలో 50 శాతం అదనంగా యూపీఐ చెల్లింపులు పెరుగుతున్నట్లు తేలింది.