ఎండలు కాస్త తగ్గినా వేడి తీవ్రత అలాగే ఉంది. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయట కాస్త ఎండలో ఉండడం వల్ల అవస్థలకు గురవుతున్నారు. దీంతో బయటకు వెళ్లాలంటే కారు ఉన్న వారు అందులోనే వెళ్తున్నారు. అయితే బయటకు వెళ్లిన ప్రదేశంలో సరైన పార్కింగ్ లేకపోతే కారును ఎండలోనే ఉంచాల్సి వస్తుంది. దీంతో కారు చాలా వరకు హీటెక్కుతుంది. ఇలా వేడి అయిన కారులో ఒక్కసారిగా ఏసీ చేసి కూల్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంది. అదేంటో చూద్దాం..
కారును ఎండలో పార్కింగ్ చేసేటప్పుడు సరైన ప్రదేశాన్ని చూసుకోవాలి. వీలైతే ఓ చెట్టు కింద పార్కింగ్ చేసే ప్రయత్నం చేయాలి. అయితే ఇది సాధ్యం కానీ సందర్భాలు లేకపోలేదు. ఇలాంటప్పుడు కారు వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన కారులో ప్రయాణించడం సాధ్యం కాదు. దీంతో కారులోకి ఎక్కిన వెంటనే కారు డోర్ల విండోలను మూసేసి చాలా మంది ఏసీ ఆన్ చేస్తారు. డోర్ల విండోలను ఓపెన్ చేయడం వల్ల ఏసీ బయటకు పోతుందని అలా చేస్తారు. కానీ ఇక్కడే ఓ మిస్టేక్ చేస్తున్నారు.
కారు డోర్లు మూసి వేసి ఏసీ ఆన్ చేయడం వల్ల అప్పటి వరకు ఉన్న హీట్ వాతావరణం అందులోనే ఉండిపోతుంది. దీంతో ఒక్కసారిగా కూల్ అయిన వాతావరణం దెబ్బతిని కాలుష్యంలా మారుతుంది. దీంతో ఆ గాలిని పీల్చుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఎండవేడితో అప్పటి వరకు కారు సీట్లు, డ్యాష్ బోర్డుపై ఉన్న బింజైమ్ లో ఏసీ గాలిలో కలిసి పోతాయి. ఇవి సాధారణం కంటే 40 రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి పీల్చడం ద్వారా శ్వాస కోస సంబంధిత వ్యాధులు వస్తాయి.
అందువల్ల ఎండలో ఉన్న కారులోకి ఎక్కిన తరువాత ముందుగా ఏసీకి సంబంధించిన ఫ్యాన్ ఆన్ చేయాలి. ఈ సమయంలో కారు డోర్ విండోను ఓపెన్ చేయాలి. అప్పుడు ఫ్యాన్ గాలి వల్ల కారులో ఉన్న గాలి అంతా బయటకు వెళ్తుంది. ఆ తరువాత ఏసీ ఆన్ చేసి కూల్ చేయాలి. ఇలా చేయడం ద్వారా అనారోగ్యం సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఏసీ పై ఎలాంటి ప్రభావం పడకుండా ఉంటుంది.