PMAY:  కేంద్రం సూపర్ స్కీమ్.. సొంతింటి కలను సులువుగా నెరవేర్చుకునే ఛాన్స్!

PMAY: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. దాదాపుగా ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను మొదలుపెట్టింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గం(ఈడబ్ల్యూఎస్) కు చెందిన చెందిన వాళ్లలో కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు. తక్కువ ఇన్‌కమ్ గ్రూప్(ఎల్ఐజీ) […]

Written By: Navya, Updated On : April 7, 2022 8:03 pm
Follow us on

PMAY: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. దాదాపుగా ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను మొదలుపెట్టింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గం(ఈడబ్ల్యూఎస్) కు చెందిన చెందిన వాళ్లలో కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు.

తక్కువ ఇన్‌కమ్ గ్రూప్(ఎల్ఐజీ) కు చెందిన వాళ్లు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఆదాయం ఉంటే ఈ స్కీమ్ కు అర్హులు. మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ 1 (ఎంఐజీ1) లబ్ధిదారులు రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయం ఉంటే అర్హులు కాగా మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ 2 (ఎంఐజీ 2) లబ్ధిదారులు ఆదాయం రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉంటే అర్హత కలిగి ఉంటారు. ఆదాయ రుజువు కార్డ్, అడ్రస్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

గృహా రుణాలపై వడ్డీ రాయితీలను అందించడం కేంద్రం ఈ స్కీమ్ ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. http://pmaymis.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో ‘సిటిజన్ అసెస్‌మెంట్’ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి ఆధార్ వివరాలను ఎంటర్ చేసి క్యాప్చా కోడ్‌, ఇతర వివరాలను ధృవీకరించి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా ఈ స్కీమ్ కొరకు సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అర్హతలను తనిఖీ చేసుకుని ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు 2.67 లక్షల రూపాయల వరకు వడ్డీ రాయితీ లభిస్తోంది.