Pm Mudra Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ కూడా ఒకటి కాగా తొలి దశలో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుని ఎంతోమంది ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందారు. తాజాగా మరో దశ ముద్ర స్కీమ్ ప్రారంభం కాగా బ్యాంకులు ఈ స్కీమ్ ద్వారా రుణాలను పంపిణీ చేస్తున్నాయి.
రుణాలు పొందడానికి అవకాశం ఉన్నవాళ్లకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ కు అర్హులైన వాళ్లు సులువుగా రుణం పొందవచ్చు. ఈ స్కీమ్ లో మొత్తం శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు కేటగిరీలు ఉండగా శిశు కేటగిరీ కింద 50,000 రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయూతనిచ్చే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ను మొదలుపెట్టింది.
మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ చిన్న వ్యాపారులకు 10 లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీకే రుణం పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటికి తోడ్పాటు ఇవ్వడానికి ముద్ర స్కీమ్ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అర్హులైన వాళ్లు ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా, ఐడెంటిటీ ప్రూఫ్, రెండు ఫోటోలు, బిజినెస్ ప్రూఫ్ ఉంటే ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: Whatsapp Cashback: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. రూపాయి పంపినా రూ.51 క్యాష్ బ్యాక్!
https://udyamimitra.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మన దేశ పౌరుడై ఉండి 10 లక్షల రూపాయల లోపు రుణ అవసరం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సూక్ష్మ ఋణ సంస్థ (ఎంఎఫ్‌ఐ), లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) అధికారులను సంప్రదించి ఈ లోన్ ను సులువుగా పొందవచ్చు.
Also Read: Indian CEOs: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ దిగ్గజ కంపెనీల్లో భారతీయులకే అత్యున్నత పదవులు.. ఎందుకు..?