https://oktelugu.com/

Gold Silver Price Today : పెళ్లిళ్లకు బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 6న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.61,640 గా ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2023 / 09:35 AM IST

    Gold Prices today

    Follow us on

    Gold Silver Price Today : పెళ్లిళ్లకు బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. మొన్నటివరకు పెరుగుతూ వచ్చిన ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పులు లేవు. 2023 నవంబర్ 6 సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 6న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.61,640 గా ఉంది. నవంబర్ 5న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,600తో విక్రయించారు. ఆదివారం కంటే సోమవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,790గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,500 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.61,640 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,150 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,350తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.56,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,640తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.56,500తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.61,640తో విక్రయిస్తున్నారు.

    బంగారం ధరలతో పాటు వెండి ధరలు స్థిరంగానే కొనసాగాయి.. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,000గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,000గా ఉంది. ముంబైలో రూ.75,000, చెన్నైలో రూ.78,000, బెంగుళూరులో 74,000, హైదరాబాద్ లో రూ.78,000తో విక్రయిస్తున్నారు.