Personal Loan Rules : ఇంట్లో పెళ్లిళ్లు, ఆరోగ్య సమస్యలు, పిల్లల ఉన్నత చదువులు లేదా ఇతర అత్యవసర అవసరాల కోసం చాలామంది బ్యాంకుల నుంచి లేదా ఫైనాన్స్ కంపెనీల నుంచి నాన్ కోలాటరల్ వ్యక్తిగత లోన తీసుకుంటున్నారు. ఈ విధంగా లోన్ తీసుకున్న తర్వాత వాళ్లు నెల బ్యాంకులకు లేదా ఫైనాన్స్ కంపెనీలకు ఈఎంఐ క్రమం తప్పకుండా చెల్లించాలి. కానీ లోన్ పొందిన చాలా మంది సమయానికి ఈ ఈఎంఐ చెల్లించడం లేదు. అయితే ఈ విధంగా ఆరు నెలలు వరుసగా ఈ ఎం ఐ చెల్లించకపోతే ఏం జరుగుతుంది.. వీటిపై బ్యాంకులు ఎలా స్పందిస్తాయి.. జైలు శిక్ష తప్పదా అనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఒక బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత ఆ బ్యాంకుకు మీరు ఒక నెల కూడా ఈ ఎం ఐ కట్టకపోతే మీకు ఆ సదరు బ్యాంకు నుంచి కాల్స్ రావడం ప్రారంభం అవుతుంది. వాళ్లు మీకు పదే పదే ఫోన్ చేసి గుర్తు చేస్తారు. ఈ క్రమంలో చాలా ఎస్ఎంఎస్లు కూడా వస్తాయి. ఇటువంటి సమయంలో బ్యాంకు వేరే ఒక స్టెప్పు తీసుకోకుండా ముందుగానే మీరు ఈ సమస్యను అర్థం చేసుకొని ఈ ఎం ఐ చెల్లించాలి అంటూ మీకు సూచిస్తుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకపోయినా లేదా మీ ఆదాయం ఆలస్యం అయిన కారణాన్ని తెలుసుకొని బ్యాంక్ అధికారులు మీకు సహకరించడానికి ప్రయత్నిస్తారు.
Also Read : భారత్‌లో డిజిటల్ ఆర్థిక విప్లవం.. మొబైల్ వినియోగంతో ఆర్థిక స్వాతంత్య్రం!
ఒకవేళ మీరు వరుసగా మూడు నెలలు ఈఎంఐ కట్టలేకపోతే అప్పుడు బ్యాంక్ అధికారులు రికవరీ ఏజెంట్లను రంగంలోకి దింపడం జరుగుతుంది. ముందుగా ఈ ఏజెంట్లు ఫోన్ చేసి మీతో మాట్లాడతారు. కొన్ని కొన్ని సార్లు వీళ్లు నేరుగా ఇంటికి వచ్చి కూడా మాట్లాడే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఈ ఏజెంట్లు మీకు బెదిరింపులకు పాల్పడకూడదు. ఒకవేళ మీరు మానవీయంగా స్పందించకపోతే ఏజెంట్లు మీపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఈ ఒత్తిడి కూడా లిమిట్స్ లోనే ఉంటుంది. ఒకవేళ వారు మీపై ఎక్కువ ఒత్తిడి చేసినట్లయితే వారి ప్రవర్తన పై మీరు ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఒకవేళ మీరు వరుసగా ఆరు నెలలు ఈఎంఐ కట్టకపోతే సదరు బ్యాంకు లు మీ మీద చట్టపరమైన చర్యలు మొదలుపెడతాయి.
అప్పుడు మీకు ముందుగా వారు లీగల్ నోటీసు పంపిస్తారు. ఈ నోటీసులో మీరు ఎంత బాకీ ఉన్నారు, చెల్లించాల్సిన గడువు తేదీ అలాగే పూర్తి వివరాలు ఉంటాయి. ఇది ఒక సివిల్ నోటీసు కాబట్టి ఇది క్రిమినల్ కేస్ కింద రాదు. ఈ నోటీస్ పొందిన తర్వాత మీరు స్పందించి బ్యాంకుతో సెటిల్మెంట్ గురించి మాట్లాడుకునే అవకాశం ఉంది. లేకపోతే సదరు బ్యాంక్ కోర్టులో మీ మీద కేసు వేస్తారు. ఒకసారి కోర్టులో కేసు వేసిన తర్వాత మీ జీవితం లేదా ఇతర ఆదాయాలనుంచి కోర్టు కొంత మొత్తాన్ని రికవరీ చేయమని ఆదేశిస్తుంది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా మీరు చెల్లించకుండా ఉన్నట్లయితే మీ మీద కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.