https://oktelugu.com/

పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్.. సులభంగా లోన్ పొందే ఛాన్స్..?

ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థలలో ఒకటైన పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు నిమిషాల్లో యూజర్లు సులభంగా లోన్ పొందే అవకాశం కల్పించడంతో పాటు లోన్ కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ సర్వీస్‌ పేరుతో పేటీఎం అందుబాటులోకి తెచ్చిన సర్వీసుల ద్వారా పేటీఎం కస్టమర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. Also Read: సీఐఎస్ఎఫ్ లో 690 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో జతకట్టి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 7, 2021 / 09:03 AM IST
    Follow us on


    ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థలలో ఒకటైన పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు నిమిషాల్లో యూజర్లు సులభంగా లోన్ పొందే అవకాశం కల్పించడంతో పాటు లోన్ కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ సర్వీస్‌ పేరుతో పేటీఎం అందుబాటులోకి తెచ్చిన సర్వీసుల ద్వారా పేటీఎం కస్టమర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది.

    Also Read: సీఐఎస్ఎఫ్ లో 690 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..?

    నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో జతకట్టి పేటీఎం ఈ సర్వీసులను అందిస్తూ ఉండటం గమనార్హం. లోన్ తీసుకున్న తరువాత సంవత్సరంన్నర నుంచి మూడు సంవత్సరాల లోపు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. లోన్ తీసుకోవాలని భావించే వాళ్లకు క్రెడిట్ స్కోర్ తో పాటు షాపింగ్ ప్యాట్రన్ ను బట్టి కేంద్రం రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. పేటీఎం యాప్ లోని పర్సనల్ లోన్ ట్యాబ్ ద్వారా రుణం కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: హోం లోన్ తీసుకునే వారికి బంపర్ ఆఫర్.. రూ.10,000 డిస్కౌంట్..!

    పేటీఎం సీఈవో భవేశ్ గుప్తా ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ సర్వీస్ గురించి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో లోన్ తీసుకోవాలని భావించే వాళ్లకు పేటీఎం తెచ్చిన ఈ సర్వీసుల ద్వారా ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. చాలామంది పేటీఎం యూజర్లు ఈ లోన్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని భవేశ్ గుప్తా తెలిపారు. ఇప్పటికే ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ సర్వీస్ ద్వారా 400 మంది యూజర్లు లోన్ తీసుకున్నారని సమాచారం.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

    ప్రస్తుతం పేటీఎం యూజర్లలో కొందరికి మాత్రమే ఈ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకురాగా భవిష్యత్తులో అందరికీ ఈ ఆప్షన్ అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఎప్పుడైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో ఈ ఆప్షన్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.