గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్.. రూ.800 వరకు క్యాష్ బ్యాక్..?

దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఒక్కో రాష్ట్రంలో సిలిండర్ ధర ఒక్కో విధంగా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధర 850 రూపాయల నుంచి 900 రూపాయల వరకు ఉంది. అయితే గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఏకంగా 800 రూపాయల వరకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. పేటీఎం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ […]

Written By: Navya, Updated On : June 5, 2021 8:02 am
Follow us on

దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఒక్కో రాష్ట్రంలో సిలిండర్ ధర ఒక్కో విధంగా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధర 850 రూపాయల నుంచి 900 రూపాయల వరకు ఉంది. అయితే గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఏకంగా 800 రూపాయల వరకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

పేటీఎం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్ ను ప్రకటించగా పేటిఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ. 10 నుంచి రూ.800 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. లక్ ఉన్నవాళ్లు ఏకంగా 800 రూపాయలు క్యాష్ బ్యాక్ పొందినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తొలిసారి పేటీఎం యాప్ ను ఉపయోగించి గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకున్న వాళ్లు మాత్రమే ఈ ఆఫర్ పొందడానికి అర్హత సాధిస్తారు.

ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని అనుకునే వాళ్లు మొబైల్ ఫోన్‌లో పేటీఎం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. భారత్ గ్యాస్, హెచ్ పీ గ్యాస్, ఇండెన్ గ్యాస్ ఆప్షన్ లలో డీలర్ షిప్ ను ఎంపిక చేసుకుని వంట గ్యాస్ ప్రొవైడర్, వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వివరాలు ఎంటర్ చేసి లావాదేవీ పూర్త్ చేయాలి. లావాదేవీ జరిపిన 48 గంటల్లో స్క్రాచ్ కార్డ్ వస్తుంది.

స్క్రాచ్ కార్డును వారం రోజులోగా ఉపయోగించాల్సి ఉంటుంది. వారం రోజుల తరువాత స్క్రాచ్ కార్డు ఎక్స్ పైరీ అవుతుంది. తొలిసారి గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకున్న వాళ్లు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులు కావడంతో అందరూ ఈ ఆఫర్ వల్ల ప్రయోజనం పొందలేరు.