Paytm: ప్రముఖ మనీ ట్రాన్స్ ఫర్ బ్యాంక్ పేటీఎం బ్యాంక్ కు మరో దెబ్బ తగిలింది. పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించినప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటున్న తరుణంలో తాజాగా ఈ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ భవేష్ గుప్తా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పేటీఎం కు సంబంధించిన కార్యకలాపాలు తగ్గిపోయాయి. మరోవైపు ఈ కంపెనీకి చెందిన షేర్లు పడిపోయాయి. ఈ తరుణంలో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శర్మ కంపెనీని గాడిలో పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సంస్థకు చెందిన చీఫ్ ఆపరేటింగ్ రాజీనామాతో కలకలం ఏర్పడింది. అయితే ఆయన రాజీనామాకు కారణాలు ఏం చెప్పారో తెలుసా?
రెండు నెలల కిందట పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం కార్యకలాపాలు క్ణీణించడం ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ కంపెనీకి చెందిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ భవేష్ గుప్తా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 31 మే 2024 వరకు ఆయన పదవిలో ఉంటారు. ఆ తరువాత సలహా దారు పాత్రలో కొనసాగుతారు. అయితే ఆయన రాజీనామాకు కారనాలేంటి? అని చర్చ జరుగుతున్న తరుణంలో.. పునర్వ్యవస్థీకరణలో భాగంగా వ్యక్తిగతంగా ఉన్న సమస్యలతోనే ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
భవేష్ గుప్తా రాజీనామాను కంపెనీ ఆమోదించినట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న పేటీఎంకు ఇది షాకింగ్ న్యూస్ అనుకున్నా.. త్వరలో మార్పులు ఉంటాయని కంపెనీ సీఈవో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన పేటీఎం కష్టాల నుంచి బయటపడేందుకు ఇప్పటికే వివిధ కంపెనీలను సంప్రదించారు. కానీ ఎవరి నుంచి మద్దతు పొందలేకపోతున్నారు. కానీ తొందర్లోనే కష్టాలు తీరుతాయని ఆయన చెబుతూ వస్తున్నారు.
మరోవైపు పేటీఎం నుంచి పేమేంట్స్ నిలిపివేసుకోవాలని ఆర్బీఐ గత రెండు నెలల కిందటే తెలిపింది. దీంతో పేటీఎం నుంచి చాలా మంది వైదొలుగుతున్నారు. ఈ క్రమంలో కంపెనీకి చెందిన షేర్లు కూడా భారీగా పడిపోతున్నాయి. ఇదిలా ఉండగా పేటీఎం షేర్లు శనివారం సాయంత్రం నాటికి ఒక్కోటి రూ.369.90 వద్ద ట్రేడింగ్ అయ్యాయి. ఫోన్ పే, గూగుల్ పేలు అగ్రస్థానంలోకి వెళ్తున్నారు. ఈ రెండు యాప్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.