https://oktelugu.com/

Surekha Vani Daughter: పెళ్లంటూ చేసుకుంటే ఆ హీరోనే చేసుకుంటా… సురేఖావాణి కూతురు సుప్రీత క్రేజీ కోరిక!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కెమెరా ముందుకు రాకుండానే తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించింది సుప్రీత. తల్లి సురేఖ వాణి మాదిరి ఇండస్ట్రీలో సెటిల్ కావాలనేది సుప్రీత కల

Written By: , Updated On : May 6, 2024 / 10:59 AM IST
Surekha Vani Daughter Supritha Naidu wants to marry Vijay Devarakonda

Surekha Vani Daughter Supritha Naidu wants to marry Vijay Devarakonda

Follow us on

Surekha Vani Daughter: నటి సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగులో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. తమిళ్ లో సినిమాలు చేస్తుంది. కాగా సురేఖ వాణి తన కూతురు సుప్రీత తో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. రీల్స్, డాన్స్ వీడియోలతో ఈ తల్లీ కూతుళ్లు రెచ్చిపోతుంటారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కెమెరా ముందుకు రాకుండానే తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించింది సుప్రీత. తల్లి సురేఖ వాణి మాదిరి ఇండస్ట్రీలో సెటిల్ కావాలనేది సుప్రీత కల. ఆ వైపుగా అడుగులు వేస్తూ తన అందం, గ్లామర్ తో కుర్రకారును ఎట్రాక్ట్ చేసింది. ఓ హీరోయిన్ కి కావాల్సినంత పాపులారిటీ కూడగట్టుకుంది. యూట్యూబ్ లో మ్యూజిక్ ఆల్బమ్స్, షార్ట్ ఫిలిమ్స్ వంటివి చేసి మరింత క్రేజ్ రాబట్టింది.

తాను కోరుకున్న విధంగా సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్న మూవీ లో సుప్రీత హీరోయిన్. కాగా ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. కాగా సుప్రీత తరచు ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. వారితో ఆన్లైన్ లో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. వారు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెబుతుంది.

ఇక తాజాగా మరోసారి తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్ లైవ్ లో ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలో ఆమెకు ఓ క్రేజీ ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్ పెళ్లి కానీ హీరోల్లో ఎవరిని భర్తగా కోరుకుంటున్నావు అని అడిగాడు ఓ అభిమాని. కాగా హీరో విజయ్ దేవరకొండ అని సుప్రీత ఆన్సర్ ఇచ్చింది. రౌడీ హీరోని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అని చెప్పింది. సుప్రీత చెప్పిన మాటలు విని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.