
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసి పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా జీవన్ లక్ష్య పాలసీని అమలు చేస్తోంది. ఈ పథకం తీసుకున్న పాలసీదారుడు మరణిస్తే సంవత్సరానికి కొంత మొత్తం కుటుంబ సభ్యులకు అందుతుంది. నామినీ మెచ్యూరిటీపై లాభాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది.
ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో ఆ పాలసీదారుడు మరణిస్తే అన్ని ప్రీమియంలు మాఫీ చేయడం జరుగుతుంది. బీమా చేసిన మొత్తంలో 10 శాతం ప్రతి సంవత్సరం సాధారణ ఆదాయంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ కు కనీస మొత్తం లక్ష రూపాయలు కాగా గరిష్టంగా ఎంత మొత్తానికైనా ఈ స్కీమ్ ను తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీ మెచ్యూరిటీ 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలుగా ఉంటుంది.
నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన ఈ పాలసీకి ప్రీమియంను చెల్లించే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలుగా ఉంది. ఈ స్కీమ్ లో చేరడానికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు కాగా గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 65 సంవత్సరాలుగా ఉంది. ఈ పాలసీపై ఎల్‌ఐసి రెండు రకాల రైడర్ లను అందిస్తుండటం గమనార్హం. పాలసీ తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత రుణ సదుపాయం లభిస్తుంది.
ఉదాహరణకు 30 సంవత్సరాల వయస్సు ఉన్న పాలసీదారుడు 5 లక్షల రూపాయలకు పాలసీ తీసుకుంటే ప్రీమియం చెల్లించే కాలం 22 సంవత్సరాలుగా పాలసీ మెచ్యూరిటీ 25 సంవత్సరాలుగా ఉంది. 22 సంవత్సరాలలో ప్రీమియంగా 4.60 లక్షలు చెల్లిస్తే మెచ్యూరిటీపై మొత్తం రూ.13.50 లక్షలు పొందే అవకాశం అయితే ఉంటుంది.