Usage Based Insurance: సాధారణంగా కారు ఉన్న ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే కార్ ఇన్సూరెన్స్ మోడల్, వయసును బట్టి ఇన్సూరెన్స్ కు సంబంధించిన ప్రీమియం లను సంస్థలు నిర్ణయిస్తాయి. ఇలాంటి ఇన్సూరెన్స్ రెగ్యులర్గా కార్లు నడిపే వారికి చాలా ఉపయోగకరం. కానీ వారానికి, నెలకోసారి కారు బయటకు తీసే వారికి మాత్రం ఇది నష్టమే అని భావిస్తారు. అయితే మోటార్ ఇన్సూరెన్స్ విభాగంలో కొత్త మార్కులు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు వాహనం నడిపినా… నడపకున్నా.. ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చెల్లించేవారు. కానీ ఇప్పుడు వాహనం ఎంతవరకు డ్రైవ్ చేస్తారో.. అంతవరకు మాత్రమే ఇన్సూరెన్స్ చెల్లించే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనినే Usage Best Insurance (UBI) అని అంటున్నారు. అసలు ఏంటి ఈ ఇన్సూరెన్స్..? ఎందుకు డ్రైవ్ చేసిన వరకే ఇన్సూరెన్స్ చెల్లించాలి
ప్రస్తుత రోజుల్లో ఇన్సూరెన్స్ తప్పనిసరిగా మారింది. అయితే కొందరు కారు కొనుగోలు చేసినా కూడా.. వర్క్ ఫ్రం హోం లేదా ఇతర కారణాలవల్ల వాహనాన్ని ఎక్కువసార్లు బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. కానీ వీరు తప్పక ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటినుంచి కేవలం వాహనం యూస్ చేసిన వరకు మాత్రమే ఇన్సూరెన్స్ వెళ్లే విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ఒక కారు ఎంతవరకు లేదా ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుందో.. అంతవరకు మాత్రమే ఇన్సూరెన్స్ చెల్లించవచ్చు. అంతేకాకుండా మెరుగైన డ్రైవింగ్ చేసేవారి డేటాను సేకరిస్తారు. మీరు మంచి డ్రైవింగ్ అని అనుకుంటే వారికి రివార్డు కూడా ప్రకటిస్తారు. అంతేకాకుండా వేగంగా వెళ్లకుండా, అకస్మాత్తుగా బ్రేకులు వేయకుండా కారు నడిపితే ప్రశంసలు కూడా కురిపిస్తారు.
ఇప్పటివరకు కారు ఇన్సూరెన్స్ తీసుకుంటే అన్ని రకాల విపత్తులకు వర్తించేవి కావు. దీంతో కొందరు యాడ్ ఆన్ ఆప్షన్లు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే UBI ఇన్సూరెన్స్ భారీ వర్షాలు కురిసే సమయంలో ఇంజన్ లోకి నీరు చేరితే అయ్యే ఖర్చును భరిస్తుంది. అలాగే రోడ్ల వల్ల టైర్లు దెబ్బతింటే.. టైర్ ప్రొటెక్షన్ అనే అదనపు సదుపాయాన్ని కల్పిస్తుంది. ఒక వాహనానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా కూడా మరమ్మతు ఖర్చులను UBI చూసుకుంటుంది. దీంతో కార్ల యజమానులకు దాదాపు ఎక్కువ శాతం డబ్బులు ఆదాయే అవకాశం ఉంటుంది.
అలాగే ఏదైనా సందర్భంలో కారు ధ్వంసమైనా.. చివరికి గురైనా.. కారుకు సంబంధించిన డబ్బులను లెక్క కట్టిస్తారు. ఈ విధంగా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్న ఈ ఇన్సూరెన్స్ అందుబాటులోకి వచ్చింది.