Facebook Loan: మనలో చాలామంది రుణాలను పొందాలని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంటికోసం అప్పు చేస్తుంటే మరి కొందరు పెళ్లి కోసం, ఇతర ఖర్చుల కోసం అప్పు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా దిగ్గజాలలో ఒకటైన ఫేస్ బుక్ రుణాలను పొందాలని అనుకునే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఫేస్ బుక్ యూజర్లకు రుణం పొందే అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తుండటం గమనార్హం. ఇండిఫై ద్వారా ఈ సంస్థ లోన్స్ అందిస్తుండగా అర్హత ఉన్నవాళ్లు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే ఇందులో అందరూ రుణాలు తీసుకోవడం సాధ్యం కాదు. చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు మాత్రం ఫేస్‌బుక్ స్మాల్ బిజినెస్ లోన్స్ ప్రోగ్రామ్ ద్వారా లోన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. గతంలో ఫేస్ బుక్ ఈ తరహా లోన్స్ ను 200 పట్టణాలలో అందించగా ఇప్పుడు మాత్రం ఏకంగా 329 పట్టణలలో అందించడం గమనార్హం. ఎవరైతే ఈ రుణాలను తీసుకుంటారో వాళ్లకు తీసుకున్న రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదని సమాచారం.
ఏ ఆస్తులను తనఖా పెట్టకుండానే ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ లోన్ పై 17 శాతం నుంచి 20 శాతం వరకు వడ్డీరేటు అమలవుతుండటం గమనార్హం. https://www.facebook.com/business/small-business-loans లింక్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అప్లై నౌ అనే ఆప్షన్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
లింక్ ద్వారా ప్రస్తుతం ఏయే ప్రాంతాలలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయో ఆ వివరాలను కూడా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మన దేశ పౌరులై ఉండే ఫేస్ బుక్ యూజర్లు అయితే మాత్రమే ఇందుకోసం దరఖస్తు చేసుకోవచ్చు. ఫేస్ బుక్ లో బిజినెస్ ను అడ్వర్టైజ్ చేసిన వాళ్లు మాత్రమే ఈ లోన్ కు దరఖాస్తు చేయడానికి అర్హులు అని చెప్పవచ్చు.