OPPO Premium Phones 2026: OPPO Reno 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో ఐరోపా మార్కెట్‌లోకి రాబోతున్నాయని సమాచారం. ఇటలీకి చెందిన ‘Epto’ అనే రిటైలర్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ల ధరలకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. ఈ వివరాల ప్రకారం.. ప్రీమియం ఫోన్ల కోసం ఎదురుచూసేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఈ ఫోన్లు ఎలా ఉంటాయంటే..
ఇటలీకి చెందిన రిటైలర్ వెబ్‌సైట్ జాబితా ప్రకారం.. OPPO Reno 16 సిరీస్ కింద మూడు మోడల్స్ Reno 16, Reno 16 Pro, Reno 16 FS అనే మూడు ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో
Oppo Reno 16 FS 5G: సుమారు 791.90 యూరోలు ( రూ.78,400)
Oppo Reno 16 5G: సుమారు 890.91 యూరోలు (రూ. 88,200)
Oppo Reno 16 Pro 5G: సుమారు 1,087.90 యూరోలు (రూ. 1,07,700)
అయితే ఇవి ఖచ్చితమైన అధికారిక ధరలు కాకపోయినా.. ఐరోపాలో లాంచ్ సమయానికి ఉండబోయే అంచనా ధరలను ఇవి సూచిస్తున్నాయి.
ఈ సిరీస్ ఫోన్లు ఇప్పటికే మే 25, 2026న చైనాలో లాంచ్ అయ్యాయి. Reno 16 మోడల్‌లో 6.32-అంగుళాల OLED డిస్‌ప్లే, శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8550 ప్రాసెసర్ ఉన్నాయి. అలాగే 6,700mAh భారీ బ్యాటరీ ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం ఇందులో 200MP ప్రధాన కెమెరా 50MP అల్ట్రా-వైడ్ , 50MP టెలిఫోటో సెన్సార్లతో కూడిన అద్భుతమైన కెమెరా సెటప్ ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ ఫోన్ల కోసం యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే త్వరలో యూరప్ మార్కెట్లోకి వస్తున్నాయి. భారతీయ మార్కెట్ కోసం కూడా ఈ సిరీస్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇటీవల ఇండియన్ వేరియంట్ కూడా గీక్‌బెంచ్ సైట్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోన్లు బ్లాక్, వైట్ రంగుల్లో కనిపిస్తున్నాయి.

