Oppo Reno 16 features: Oppo తన ప్రతిష్టాత్మక ‘రెనో’ (Reno) సిరీస్‌లో భాగంగా తదుపరి వెర్షన్ ‘ఒప్పో రెనో 16’ (Oppo Reno 16) సిరీస్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మొబైల్ అధికారికంగా మే 25, 2026న చైనాలో విడుదల కానుంది. దీంతో పాటు 16 ఫ్రో కూడా మార్కెట్లోకి రానంది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ల గురించిన వివరాలు వీడియోల ద్వారా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఫోన్ ఎప్పడు మార్కెట్లోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నార. వీడియోల ప్రకారం ఈ ఫొన్ ఎలా ఉండబోతుందంటే?
Oppo Reno 16, 16 ఫ్రో ఫోన్లు ప్రీమియం లుక్‌తో రానున్నాయి. రెనో 16 మోడల్ 6.32-అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లేతో ఉండనుంది.ఇది 1.5K రిజల్యూషన్ తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇక ప్రో వేరియంట్ మరింత పెద్దదైన 6.78-అంగుళాల ఫ్లాట్ OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది . ఈ ఫోన్లు గెలాక్సీ పర్పుల్, హార్ట్‌బీట్ , మూన్‌లైట్ ఈజ్ డార్క్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభించనున్నాయి.
ఈ సిరీస్ కలిగి ఫోన్లు పర్ఫార్మెన్స్ పరంగా చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నాయి. రెనో 16 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్‌తో పనిచేయనుండగా, ప్రో వేరియంట్ మరింత శక్తివంతమైన డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని అంచనా. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ OS 16పై రన్ అవుతాయి. 12GB ర్యామ్ నుంచి 256GB స్టోరేజ్ నుంచి గరిష్టంగా 16GB ర్యామ్ 1TB స్టోరేజ్ వరకు వివిధ వేరియంట్లలో లభించే అవకాశం ఉంది.
కెమెరా విభాగంలో ఒప్పో ఈసారి భారీ మార్పులు చేస్తోంది. రెండు మోడళ్లలోనూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. ఇందులో 200 మెగాపిక్సెల్ శామ్సంగ్ HP5 ప్రైమరీ సెన్సార్ , 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది.
బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ సిరీస్‌లో గణనీయంగా పెంచారు. రెనో 16లో 6,700mAh బ్యాటరీని, ప్రో వేరియంట్‌లో ఏకంగా 7,000mAh బ్యాటరీని అందించనున్నారు. ఈ ఫోన్లు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి, ప్రో మోడల్ అదనంగా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కలిగి ఉంటుంది. వీటితో పాటు, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ ను కలిగి ఉంది. కొత్తగా ‘స్నాప్ కీ’ (Snap Key) వంటి ఫీచర్లను ఒప్పో ఇందులో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం చైనాలో ప్రీ-రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ఈ సిరీస్ వచ్చే జూలై నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
