Homeబిజినెస్OnePlus Nord 6: ఈరోజు విడుదల.. సూపర్ ఫీచర్స్.. ధర అందుబాటులోనే.. ఈ ఫోన్ గురించి...

OnePlus Nord 6: ఈరోజు విడుదల.. సూపర్ ఫీచర్స్.. ధర అందుబాటులోనే.. ఈ ఫోన్ గురించి తెలుసుకోవాల్సిందే..

OnePlus Nord 6: 2026 ఏప్రిల్ నెల సందర్భంగా కొత్త మొబైల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీకి చెందిన ఓ కొత్త ఫోన్ వినియోగదారులకు మంగళవారం పరిచయం చేయబోతుంది. ఇందులో కెమెరా నాణ్యతతో పాటు బ్యాటరీ పవర్ కూడా అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రోజువారి వినియోగదారులకు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఇంతకీ ఈ మొబైల్ లాంచ్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. OnePlus కంపెనీ నుంచి మంగళవారం రాత్రి […]

OnePlus Nord 6: 2026 ఏప్రిల్ నెల సందర్భంగా కొత్త మొబైల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీకి చెందిన ఓ కొత్త ఫోన్ వినియోగదారులకు మంగళవారం పరిచయం చేయబోతుంది. ఇందులో కెమెరా నాణ్యతతో పాటు బ్యాటరీ పవర్ కూడా అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రోజువారి వినియోగదారులకు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఇంతకీ ఈ మొబైల్ లాంచ్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

OnePlus కంపెనీ నుంచి మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో Nord 6 అనే స్మార్ట్ ఫోన్ యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీని గురించి ఇప్పటికే సమాచారం అందించినప్పటికీ ఫీచర్స్, ధర విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే దీని ఫీచర్ వివరాల్లోకి వెళ్తే ఈ మొబైల్ లో అంగుళాల OLED డిస్ప్లే ఉండనుంది. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 4500 nits బ్రైట్నెస్ తో పనిచేసే ఈ మొబైల్ డిస్ప్లే 1.5 కె రిజల్యూషన్ తో ఉంటుంది. అలాగే ఇందులో Qualcomm స్నాప్ డ్రాగన్ 8s Gen 4 చిప్ సెట్ ను చూడొచ్చు. ఇది 12gb నుంచి 16 జిబి వరకు ర్యామ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే 256 జీవీ నుంచి 512 జిబి స్టోరేజ్ వరకు వాడుకోవచ్చు. దీంతో రోజువారి వినియోగదారులతో పాటు ప్రొఫెషనల్ కోసం ఈ మొబైల్ ను ఉపయోగించుకోవచ్చు.

ఇందులో కెమెరా పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మొబైల్ లో 50 మెగాపిక్ సెల్ సోనియా లైటియా ప్రైమరీ కెమెరా ఉండనుంది. అలాగే 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం 32 ఎంపీ కెమెరా పనిచేయనుంది. ఈ కెమెరా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారితోపాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ మొబైల్ లో బ్యాటరీ పర్ఫామెన్స్ కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 9000 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 100 W ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. ఒకసారి దీనిని చార్జింగ్ చేస్తే రెండున్నర రోజుల వరకు బ్యాటరీ నిల్వ ఉండే అవకాశం ఉంటుంది.

వన్ ప్లస్ నార్డ్ 6 మొబైల్ ధర రూ.35,000 ప్రారంభం నుంచి విక్రయించే అవకాశం ఉంది. అమెజాన్, వన్ ప్లస్ ఇండియా వెబ్సైట్ ద్వారా దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్ 9 నుంచి దీనిని కొనుగోలు చేయవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper