Oneplus New Mobile Launch: ఇప్పుడు అంతా టెక్నాలజీ మయం అయిపోతుంది. ప్రతి ఒక్కరూ ఏదైనా డివైస్ కొనుగోలు చేసే సమయంలో లేటెస్ట్ అప్డేట్ తో ఉన్న వాటిని ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా రోజువారి జీవితంలో ముఖ్యమైన మొబైల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నేటి తరం వారు కోరుకునే విధంగా టెక్నాలజీ అప్డేట్ తో Oneplus నుంచి కొత్త ఫోన్ రాబోతోంది. దీని గురించి ఇప్పటికే సమాచారం వచ్చినప్పటికీ.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియ రాలేదు. కానీ ఇటీవల అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలలోనే ఈ మొబైల్ మార్కెట్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ మొబైల్ లో ఉండే స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Oneplus మొబైల్స్ అంటే చాలామంది లైక్ చేస్తారు. మిగతా వాటికంటే దీని ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు బ్యాటరీ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. వీరికి అనుగుణంగానే ఈ కంపెనీకి చెందిన మొబైల్స్ తయారు అవుతూ ఉంటాయి. ఇందులో భాగంగా లేటెస్ట్గా మార్కెట్లోకి రాబోతున్న OnePlus Ace 16 Ultra కూడా అలాగే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త మొబైల్ లో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండనుంది. ఈ డిస్ప్లే 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇది గేమింగ్ కోరుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 9500 చిప్ సెట్ ఉండనుంది. దీంతోపాటు 12gb నుంచి 16 జిబి వరకు రామ్ సపోర్ట్ చేస్తుండడంతో రోజువారి వినియోగదారులకు సపోర్టుగా ఉంటుంది.
వన్ ప్లస్ మొబైల్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ కొత్త మొబైల్ లో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండనుంది. 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. ఈ కెమెరాలు అద్భుతమైన ఫోటోలను తీసుకోవడానికి ఉపయోగపడతాయి. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి కూడా ఇది సపోర్ట్ గా ఉండనుంది. వన్ ప్లస్ కొత్త మొబైల్ లో బ్యాటరీ పనితీరు కూడా మెరుగ్గాని ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 8000 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. బిజీగా ఉండేవారు తొందరగా చార్జింగ్ కావడానికి ఈ చార్జర్ బాగా ఉపయోగపడుతుంది. వీటితోపాటు ఇందులో అదనపు ఫీచర్లు కూడా సౌకర్యాలను అందిస్తాయి.
ప్రస్తుతం ఈ మొబైల్ చైనాలో ఏప్రిల్ చివరి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనిని భారతదేశంలోకి తీసుకువస్తారని అంటున్నారు. ఒకవేళ ఇది భారతదేశంలోకి వస్తే దీని ధర రూ.34,999 నుంచి రూ.39,999 వరకు విక్రయించే అవకాశం ఉంది.