Homeబిజినెస్OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్ కావడానికి ఇంకా వారం రోజుల సమయం ఉంది. కానీ దీని బ్యాటరీ గురించి అప్పుడే చెప్పింది. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది మొబైల్ యూజర్స్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. రోజూవారీ ఫోన్ వినియోగం పెరుగుతుండడంతో దీని అవసరం పెరుగుతోంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ బ్యాటరీ బ్యాకప్ ప్రత్యేకంగా కొత్త ఫోన్ ను తీసుకురాబోతుంది. మరి ఇది ఏ ఫోన్? ఇందులో ఉండే బ్యాటరీ బ్యాకప్ ఎంత?

సాధారణంగా ప్రతీ మొబైల్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. కానీ OnePlus నుంచి కొత్తగా రాబోతున్న N6x మొబైల్ లో ఊహించని బ్యాటరీని చేర్చారు. ఇందులో ఏకంగా 7000 mAh బ్యాటరీని చేర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే రెండు రోజులకు పైగా వాడుకోవచ్చు. మార్కెటింగ్ రంగంలోని ఉద్యోగులు, నిత్యం ఫోన్ తో బిజీగా ఉండే వారికి ఈ బ్యాటరీ బ్యాకప్ బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ట్రావెల్ చేసే వారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

ఈ బ్యాటరీ ఫుల్ చార్జీ అయిన తరువాత 20.56 గంటల పాటు వీడియో ప్లే బ్యాక్ ఉంటుంది. సోషల్ మీడియా స్క్రోలింగ్ కు 25.04 గంటల బ్యాకప్ ఇస్తుంది. మ్యూజిక్ ప్లే కోసం 133.56 గంటలు, వీడియో రికార్డింగ్ కోసం 11.26 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఫొటోగ్రఫీ నిరంతర కాలింగ్ కోసం యూజ్ చేసేవారికి మరింత ఎక్కువ సమయం బ్యాటరీ ఉండే అవకాశం ఉంటుంది.

ఈ ఫోన్ లో బ్యాటరీ మాత్రమే కాకుండా ఇతర ఫీచర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. దీని వెనుక ప్లాట్ ప్యానెల్ డిజైన్ ఉండనుంది. ఇది పిల్ ఫేస్ కెమెరా మాడ్యుల్ ను కలిగి ఉంది. హెడ్ ఫోన్ ఉపయోగించేవారికి 3.55 ఆడియో జాక్ సదుపాయాన్ని ఇచ్చారు. వన్ ప్లస్ ఎన్ 6ఎక్స్ మొబైల్ రెండు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. వీటిలో ఒకటి బర్గుండీ రెడ్, ఐస్ బ్లూ.

ఈ ఫోన్ ఈనెల 31న భారత్ లో రిలీజ్ కానుంది. ఆ తరువాత దీనిని అమెజాన్, వన్ ప్లస్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లలో కొనుగోలు చేయొచ్చు. రూ. 20,000 లోపు ఈ మొబైల్ ధర ఉండే అవకాశం ఉంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా బ్యాటరీ కోసం చూస్తారు. అలాంటి వారి కోసం ఇది మంచి ఫోన్ అని టెక్ నిపుణులు అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Nara Lokesh

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....
August School Holiday

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...
Delhi Protests

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...
Bhogapuram Airport

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...
Team India Test Cricket

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Oktelugu Epaper