Homeబిజినెస్OnePlus 15T features: నేటితరం వారిని ఆకట్టుకునే ఫీచర్స్.. ఈ కొత్త మొబైల్ లో ఉన్నాయి....

OnePlus 15T features: నేటితరం వారిని ఆకట్టుకునే ఫీచర్స్.. ఈ కొత్త మొబైల్ లో ఉన్నాయి. దీని ధర తెలిస్తే వామ్మో అంటారు..

OnePlus 15T features: నిత్యావసర వస్తువుల్లో మొబైల్ ఒకటిగా మారింది. అయితే ఈ ఫోన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్తతరహాలో ఉంటే వినియోగదారుల అవసరాలు తీరుతాయి. అందుకే మార్కెట్లోకి ఏ కొత్త మొబైల్ వచ్చినా వెంటనే దాని గురించి తెలుసుకుంటూ ఉంటారు. ప్రముఖ మొబైల్ కంపెనీ One plus లేటేస్ట్ గా కొత్త ఫోన్ ను ఈ మంగళవారం విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా బ్యాటరీ వ్యవస్థ మెరుగ్గా ఉండేలా చేసింది. ఇందులో బలమైన బ్యాటరీ ఉండడంతో చాలా మంది దీని గురించి ఆలోచిస్తున్నారు. బ్యాటరీ మాత్రమే కాకుండా డిస్ ప్లే తో పాటు ఆకట్టుకునే ఫీచర్స్ ఉండడంతో ఈ ఫోన్ కొనడానికి ఆసక్తి చూపుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. ఇంతకీ ఈ మొబైల్ ఉండే బ్యాటరీ ఏ విధంగా ఉండబోతుంది? ఇది ఎలాంటి ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది?

ఇటీవల మార్కెట్లోకి వచ్చిన One Plus 15T మొబైల్ లో 6.32 అంగుళాల ఫుల్ HD+ డిస్ ప్లే ఉండనుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 1800 నిట్స్ బ్రైట్నెస్ తో పనిచేసే ఈ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ ను అమర్చారు. అలాగే ఇందులో 16 జీబీ వరకు ర్యామ్ సపోర్టు చేస్తుంది. 1 టీబీ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు కావాల్సినవన్నీ ఇందులో స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఈ మొబైల్ లో డ్యూయెల్ కెమెరా ఉండనుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉండగా.. ఇది 3.5x జ్యూస్ చేసినా కూడా రిజల్యూషన్ తగ్గకుండా ఉంటుంది. అలాగే 50 మెగా పిక్సెల్ పెరిస్కోప్ కెమెరా కూడా పనిచేయనుంది. అలాగే ఇందులో 16 మెగా పిక్సెల్ సెల్పీ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. ఈ మొబైల్ 8కె రిజల్యూషన్ తో వీడియో రికార్డింగ్ చేయగలదు.

ఇందులో ప్రధానంగా బ్యాటరీ గురించి చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ లో 7000 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 50 వాట్ వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయనుంది. ఇవే కాకుండా ఇందులో అద్భుతమైన ఫీచర్లను ఉంచారు. 4జీతో పాటు 5జీ కనెక్టివిటీ, వైఫై 7, బ్లూటూత్, యూఎస్ బీ టైప్ సీ పోర్ట్ తో పాటు జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఆన్ బోర్డ్ సెన్సార్ జాబితాలో ప్రాక్సిమిటీ సెన్సార్, ఓరియెంటేషన్ సెన్సార్ తో ఫోన్ కు సెక్యూరిటీ ఇవ్వనున్నాయి. ఈ మొబైల్ ధర విషయానికి వస్తే.. 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ వేరియంట్ మొబైల్ ధర రూ.58,000ఉండగా.. టాప్ ఎండ్ 16 జీబీ ర్యామ్, 1 టీబీ మొబైల్ ను రూ.78,000లతో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper
Exit mobile version