One Plus 13 R: One plus కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. కెమెరా పనితీరుతోపాటు, మెరుగైన బ్యాటరీ.. అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఈ ఫోన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త తరహాలో మార్కెట్లోకి వస్తుంది. అయితే అద్భుతమైన ఫీచర్లతో పాటు అడ్వాన్స్ కెమెరా ఉన్న ఈ కంపెనీకి చెందిన ఫోన్ పై భారీగా తగ్గింపును ప్రకటించారు. ఫ్లాట్ డిస్కౌంట్ రూ.2,000.. బ్యాంకు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ మరో రూ.1000 ఉండడంతో మొత్తం రూ.3,000 వరకు తగ్గింపుతో మొబైల్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఆమెజాన్ లో ఉన్న ఈ మొబైల్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Oneplus నుంచి 13R మొబైల్ ఇప్పటికే మార్కెట్లో అలరిస్తుంది. ఇందులో ఉండే ఫీచర్లను చూసి రోజువారి వినియోగదారులతో పాటు నేటితరం వారు దీని గురించి చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ధర కాస్త ఎక్కువగా ఉండడంతో దీని కొనుగోలుకు వెనుకడుగు వేశారు. కానీ ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భంగా తగ్గింపు తలను ప్రకటించారు. ఈ మొబైల్లో డిస్ప్లే గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. 6.78 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉన్న ఇది 4500 nits పిక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంది. దీనిని కార్నింగు గొరిల్లా గ్లాస్ 7 i ద్వారా సేఫ్టీగా ఉంచబడింది. బయటి వాతావరణానికి తట్టుకునే విధంగా IP 65 రేటింగును కలిగి ఉంది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేటు తో పనిచేయడంతో వీడియోలను అద్భుతమైన కలరింగ్ తో వీక్షించవచ్చు.
ఈ మొబైల్లో ఉన్న కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 50MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఇది సోనీ LYT 700 సెన్సార్ ను కలిగి ఉంటుంది.2x జూమ్ చేసినా కూడా ఎలాంటి క్వాలిటీ తగ్గదు. అలాగే 50 MP టెలిఫోటో లెన్స్, 16 MP ఫ్రంట్ కెమెరాతో ఉన్న ఈ కెమెరాతో ఫోటోగ్రఫీ అద్భుతంగా తీసుకోవచ్చు. యూత్ తో పాటు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ గారికి దీనిని ఉపయోగించి కావలసిన ఫోటోలు, 4k వీడియోలు తీసుకోవచ్చు. ఈ మొబైల్ లో బ్యాటరీ వ్యవస్థ మెరుగ్గా ఉంది. ఇందులో 6000 mAh బ్యాటరీని చేర్చగా.. ఇది 80 వాట్ సపోర్ట్ తో పనిచేస్తుంది. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OS 15 పై పని చేస్తుంది. సేఫ్టీ ఫీచర్లతో పాటు దీర్ఘకాలిక నాణ్యతను కలిగిస్తుంది. ఏఐ అన్బ్లర్, AI రిఫ్లెక్షన్, AI ఇంటలిజెన్స్ వంటి సాధనాలు సపోర్ట్ చేస్తాయి.
Oneplus 13 R mobile ఈ జనవరి ప్రారంభంలో మార్కెట్లోకి రాగా.. దీనిపై భారీ డిస్కౌంట్ను ఏర్పాటు చేశారు. మొదటగా దీని ధరను రూ.42,999 గా నిర్ణయించారు. కానీ ప్రస్తుతం దీనిపై ప్లాట్ డిస్కౌంట్ రూ.2,000 తగ్గింపును ప్రకటించారు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇలా మొత్తం రూ.3,000 తగ్గింపు జరగగా రూ.39,999 కే కొనుగోలు చేయవచ్చు.