https://oktelugu.com/

One Web Broadband : భారత్ లో మరో కొత్త బ్రాడ్ బ్యాండ్.. ఇది వచ్చిందా..? జియో పని ముగిసినట్లే..!

భారతీ గ్రూప్ మద్దతుతో శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించేందుకు ‘వన్ వెబ్’ సిద్ధమైనట్ల సంస్థ ప్రకటించింది. రెగ్యులేటరీ అనుమతులు మినహా అంతా పూర్తయినట్లు చెప్తోంది.. త్వరలోనే ఈ సేవలను ప్రారంభించి మరింత వేగంగా విస్తరిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : August 13, 2024 / 12:57 PM IST

    Oneweb Broadband

    Follow us on

    One Web Broadband : జియో లాంటి బడా కంపెనీ ఇంటర్నెట్ సేవలకు చెక్ పెట్టేందుకు భారతీ గ్రూప్ సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సేవలను విస్తరించనుంది. ఈ వ్యవస్థ శాటిలైట్ ద్వారా నేరుగా పని చేస్తుంది. ఇక వైర్లతో ఇబ్బంది ఉండకుండా.. వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం కలిగిస్తుంది. దేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు టెలీకమ్యూనికేషన్స్ డిపార్ట్ మెంట్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్లు భారతీ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ కార్యచరణపై భారతి గ్రూప్ మాతృ చైర్మన్ సునీల్ మిట్టల్ సోమవారం (ఆగస్ట్ 12) దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. ట్రాయ్ అనుమతులు త్వరగా ఇవ్వాలని కేంద్రానికి దాఖలు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ‘ఈ వ్యవస్థ అన్ని ట్రయల్స్ చేసుకొని ఇప్పుడు సిద్ధంగా ఉంది.. శాటిలైట్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తృతం చేయబోతున్నాం.. మేం డాట్ మద్దతు కోసం ఎదురు చూస్తున్నాం. అతి త్వరగా ప్రారంభించాలని అనుకుంటున్నాం. వాణిజ్య సేవలను విస్తృతం చేసేందుకు ఇది దోహదం చేస్తుంది. మారుమూల గ్రామాల్లో ప్రభుత్వ రంగ సంస్థల సేవలను కూడా ఇది మరింత సులువు చేస్తుందని నమ్ముతున్నాం’ అని ఒక ఇంటర్వ్యూలో సునీల్ మిట్టల్ వెల్లడించారు. భారతీ సంస్థ ఓ సంయుక్త భాగస్వామ్యంతో ఈ బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఇది భారతీ ఎంటర్ ప్రైజెస్, ఫ్రెంచ్ శాటిలైట్ ఆపరేటర్ యూటెల్ శాట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వెంచర్ గా అభివర్ణించారు. బ్రిటీష్ టెలికాం మేజర్ బీటీ గ్రూప్ లో భారతీ గ్లోబల్ 25శాతం వాటాను కొనుగోలు చేసిన నేపథ్యంలో మిట్టల్, యూటెలెస్ట్ వన్ వెబ్ యొక్క రెండు శాటిలైట్ నెట్ వర్క్ రెండు శాటిలైట్ పోర్టల్ లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇవి దక్షిణ, ఉత్తర భారత దేశాల్లో తమ సేవలను మరింత విరివిగా అందిస్తాయని తెలిపారు.

    మరోవైపు ఆర్మీ, నేవీ, తదితర ప్రభుత్వ ఏజెన్సీలకు వీటి సురక్షిత సేవలపై ఇప్పటికే పలు పరీక్షలు చేసిందని తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఏ నిమిషమైనా రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనుమతులు వచ్చే వరకు మేం ముందుకు వెళ్లే పరిస్థితులు లేవు. మాకు అన్ని పరీక్షలు ముగిశాయి అంటూ చెప్పుకొచ్చారు.

    అయితే ఇప్పటికే ఈ విషయంలో అనుమతులు మంజూరు చేయడానికి డాట్ ఇప్పటికే ట్రాయ్ కు పలు సూచనలు చేసినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. ట్రాయ్ ఆమోదం రాగానే సేవలను ప్రారంభిస్తాం. అవసరమైతే మధ్యంతర అనుమతులైనా ఇవ్లని కోరాం. ఇప్పుడు వారి నిర్ణయమేదైనా మాకు సమ్మతమే. ఇక ఫైనల్ నిర్ణయం వారిదే.

    అయితే మరోవైపు యాపిల్ సంస్థ భాగస్వామి గ్లోబల్ స్టార్ కూడా భారత్ లో తమ సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సంస్థ ఇప్పటికే అనుమతుల కోసం ట్రాయ్ ని సంప్రదించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించినట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ సంస్థ కూడా దరఖాస్తు చేసుకుంది. గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ లైసెన్స్ దేశంలో శాట్ కామ్ సేవలను ప్రారంభించడానికి సిద్ధం కాబోతున్నది.

    ఇప్పటి వరకు భారతి గ్రూప్ మద్దతు ఉన్న యూటెల్ శాట్, వన్ వెబ్, రిలయన్స్ గ్రూప్ నకు చెందిన అర్బిట్ కనెక్ట్ ఇండియా మాత్రమే ఇప్పటివరకు లైసెన్స్ లు పొందాయి. దీంతో పాటు ఎలోన్ మస్క్ నేతృత్వంలోని స్టార్ లింక్, అమెజాన్ గ్రూప్ నుంచి ప్రాజెక్ట్ కైపర్ వంటి గ్లోబల్ దిగ్గజాలు కూడా భారత్ లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించడానికి ప్రభుత్వం నుంచి అనుమతులను కోరాయి.

    వీటన్నింటికీ ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. 2025-26 నాటికి 1.2 బిలియన్ల భారతీయులకు ఇంటర్నెట్ సేవలను చేరువ చేసే ప్రక్రియను విజయవంతం చేయడలంలో ఇవి ప్రముఖ పాత్ర పోషించనున్నాయి.