Koratala Siva: ప్రస్తుతం మన దర్శకులందరు పాన్ ఇండియా లో భారీ సక్సెస్ లను అందుకోవాలని మంచి కథలను రాసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మన సినిమాలే నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలనే విధంగా సినిమాలు చేస్తు ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది దర్శకులు కూడా వాళ్ల సినిమాలకు పని చేయడానికి చాలా మంది కొత్త టెక్నీషియన్స్ ని అలాగే పాపులారిటీని సంపాదించుకున్న టెక్నీషియన్స్ ని తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక అందులో భాగంగానే మన స్టార్ డైరెక్టర్లు కూడా తమిళ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్లను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం ‘దేవర ‘ సినిమాతో ‘అనిరుధ్ రవిచంద్రన్’ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్న కొరటాల శివ ఈ సినిమా మ్యూజిక్ ని చాలా అద్భుతంగా మలచడంలో మాత్రం చాలా వరకు ఫెయిల్ అవుతున్నాడనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు దేవర సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి… ఇక దాంతో కొరటాల శివ పైన చాలామంది విమర్శలను చేస్తున్నారు. ఎందుకు అంటే ‘పుష్ప’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఫ్యాన్ ఇండియాలో భారీ గుర్తింపును సంపాదించుకున్న దేవి శ్రీ ప్రసాద్ ని వదిలేసి అనిరుధ్ ను తీసుకోవడం దేనికి అంటూ ఆయన మీద ఘాటు వాక్యాలైతే చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ‘కంగువ ‘ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఇక తమిళ్ డైరెక్టర్లు మన మ్యూజిక్ డైరెక్టర్లని తీసుకుంటుంటే మన వాళ్లు మాత్రం తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని చూస్తుంటే ‘పొరుగింటి పుల్లకూర కి రుచి ఎక్కువ ‘ అనే సామెత గుర్తుకొస్తుంది. నిజానికి అనిరుధ్ తమిళ్ సినిమాలకి తప్ప వేరే ఇతర ఇండస్ట్రీలో చేసే సినిమాలకి మంచి మ్యూజిక్ అయితే ఇవ్వడం లేదు. ఇక ఈ విషయం పలు సందర్భాల్లో రుజువైనప్పటికీ మన వాళ్లు మాత్రం అతని వెంటే పడుతూ భారీ రెమ్యూనరేషన్ ని చెల్లిస్తూ అతన్ని సినిమాల్లోకి తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని సినీ విమర్శకులు కూడా విమర్శిస్తున్నారు…
ఇక ఇప్పటి వరకు వచ్చిన పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప ఆల్బమ్ టాప్ 5 లో నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టి మరొకరిని తీసుకోవడం ఎందుకు మనవాళ్ళని ఎంకరేజ్ చేస్తే సరిపోతుంది కదా అంటూ విమర్శలు అయితే చేస్తున్నారు. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ని ఈ విషయంలో అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమాలో నటించడానికి బాలీవుడ్, హాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటే ఆయన మాత్రం తెలుగు హీరోలనే టాప్ హీరోలుగా మార్చాలనే ఉద్దేశ్యంతో మన తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు… ఈ విషయంలో రాజమౌళిని మనం తప్పకుండా మెచ్చుకోవాలి…