https://oktelugu.com/

Car Offers: ఈ కార్లపై ఏకంగా రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్.. అయితే ఇక్కడో ట్విస్ట్..

మారుతి సుజుకీ రిలీజ్ చేసిన బాలెనో బెస్ట్ ఆఫ్ సెల్లింగ్ లో నిలచింది. అయితే ఈ కారుపై డిసెంబర్ నెలలోపు ఆకర్షణీయమైన డిస్కౌంట్ ను ప్రకటించింది. దీనినికొనుగోలు చేసేవారికి రూ.25 నుంచి రూ.30 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : December 8, 2023 / 11:43 AM IST

    Car Offers

    Follow us on

    Car Offers: కారు కొనాలనుకునేవారికి మారుతి కంపెనీ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. తమ కంపెనికి చెందిన కొన్ని కార్లను కొనుగోలు చేస్తే క్యాష్ డిస్కౌంట్, ఇతర ఆఫర్లతో దాదాపు రూ.2 లక్షల వరకు ప్రయోజనం అందిస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ డిస్కౌంట్లను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలోపు మాత్రమే ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని పేర్కొంది. ఆ తరువాత అంటే కొత్త సంవత్సరంలో ధరలు పెంచనున్నట్లు తెలిపింది. మరి మారుతి ఆఫర్లు ఇచ్చిన ఆ మోడళ్లు ఏవో తెలుసుకుందాం..

    మారుతి సుజుకీ రిలీజ్ చేసిన బాలెనో బెస్ట్ ఆఫ్ సెల్లింగ్ లో నిలచింది. అయితే ఈ కారుపై డిసెంబర్ నెలలోపు ఆకర్షణీయమైన డిస్కౌంట్ ను ప్రకటించింది. దీనినికొనుగోలు చేసేవారికి రూ.25 నుంచి రూ.30 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. అలాగే కార్పోరేట్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ వంటివి అదనంగా ఇవ్వనున్నారు. అలాగే మారుతి సుజుకి ఇగ్నిస్ మేన్యువల్ మోడల్ పై రూ.40 వేల వరకు రిటర్న్ ఇవ్వనుంది. ఏంఎంటీ వెర్షన్ పై రూ.35 వేలు, రూ.15 వేల వరకు ఎక్స్చేంజ్ బోసన్, రూ.5 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది.

    అలాగే మారుతి సుజుకీ జిమ్నీ పై భారీ ఆఫర్స్ ను అందిస్తోంది. ఈ మోడల్ ను కొనుగోలు చేసేవారికి అన్ని రకాల డిస్కౌంట్లు కలిపి రూ.2.16 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. కొత్తగా రిలీజ్ అయ్యే జిమ్నీ థండర్ కుడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇదే కంపెనీ నుంచి వచ్చిన ఫ్రాంక్స్, పెట్రోల్, టర్బో పెట్రోల్ వేరియంట్ పై రూ.15 వేల క్యాష్ డిస్కంట్, రూ.10 వేల బోనస్ ను పొందవచ్చు.

    అయితే ఈ డిస్కౌంట్లు అన్నీ డిసెంబర్ నెలలోపే వర్తిస్తాయని తెలిపింది. ఆ తరువాత 2024 సంవత్సరంలో కార్ల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో చాలా మంది వినియోగదారులు డిస్కౌంట్లపై కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రొడక్షన్ తో పాటు అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల కారణంగా కార్ల ధరలు పెరుగుతున్నాయని పేర్కొంది. కానీ ఏ మేరకు ధరలు పెరుగుతాయనేది మాత్రం వెల్లడించలేదు.