Janhvi Kapoor
Janhvi Kapoor: జాన్వీకపూర్ పెళ్లి చేసుకోబోతున్నారా? ఈ ప్రశ్న పలువురి మదిలో మెదలాడుతోంది.. ఎందుకంటే ఆమె వివాహానికి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది.. అలనాటి అందాల తార, అతిలోకసుందరి శ్రీదేవి కూతురే జాన్వీకపూర్. తల్లికి తగ్గ తనయగా ఇప్పటికే గుర్తింపు సాధించారు.
బాలీవుడ్ లో తొలుత అరంగేట్రం చేసిన జాన్వీకపూర్ మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ రెండో సినిమా కూడా హిట్ కావడంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఆమె తెలుగు పరిశ్రమలోనూ కాలు పెట్టనున్నారు. జూనీయర్ ఎన్టీఆర్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం తెలుగు ప్రేక్షకులు, అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని చెప్పుకోవచ్చు.
అయితే తాజాగా జాన్వీ కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా తాను ప్రేమించిన వ్యక్తినేనంటూ వార్త చక్కర్లు కొడుతుంది. జాన్వీ కపూర్ కాలేజీ చదివే రోజుల్లో తన స్నేహితుడిని లవ్ చేశారని తెలుస్తోంది. వీరి మధ్య స్నేహమే ప్రేమ వరకు దారి తీసిందని అంటున్నారు. ఈ క్రమంలోనే వారి ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. దీంతో వారి లవ్ కాస్తా పెళ్లికి దారి తీసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ హల్ చల్ చేయడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు దీనిపై ఆనందం వ్యక్తం చేస్తుండటం విశేషం.
అయితే ఈ పెళ్లి విషయంపై జాన్వీ కపూర్ కానీ , ఆమె తండ్రి బోనీ కపూర్ కానీ ఇంతవరకు స్పందించలేదు. అలాగే ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ జాన్వీకపూర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారనే న్యూస్ మొత్తం సినీ పరిశ్రమలోనే చర్చనీయాంశంగా మారింది.