Ola Electric : ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైకులకు డిమాండ్ గణనీయంగా ఉంది. గత నెలలో అమ్మకాలు పడిపోవడంతో ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. దీంతో కంపెనీ స్కూటర్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అక్షయ తృతీయ సందర్భంగా ఓలా తన అన్ని మోడళ్లపై ఏకంగా రూ. 40 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ప్రత్యేక విషయం ఏమిటంటే.. ఈ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీని కూడా ఉచితంగా అందిస్తున్నారు. కాకపోతే ఈ ఆఫర్ కేవలం ఇవాళ ఒక్కరోజే అంటే ఏప్రిల్ 30న మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఓలా ఎలక్ట్రిక్ ఎప్పటికప్పుడు వివిధ రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్‌సైకిళ్లను అందిస్తూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో కంపెనీ ఆరు కొత్త ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లను విడుదల చేయనుంది.
Also Read : ఓలా ఎలక్ట్రిక్‌కు భారీ దెబ్బ.. 40కి పైగా స్టోర్లు క్లోజ్ !
ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన రెండు వేరియంట్లు
ఇటీవల కంపెనీ ఓలా S1 ప్రోను రెండు వేరియంట్లతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్కూటర్‌లో 3 కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్, 4 కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో S1 ప్రో 242 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఓలా S1 ప్రో ప్రారంభ ధర రూ.1,14,999.
ఓలా S1 ప్రో+ 4 కిలో వాట్స్, 5.3 కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో మార్కెట్‌లోకి వచ్చింది. దీని 4 కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్‌తో 242 కిలోమీటర్ల రేంజ్, 5.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో 320 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. ఈ మోడల్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో గంటకు 141 కిమీ వేగాన్ని అందుకోగలదు. ఓలా S1 ప్రో+ ధర రూ.1,54,999 నుండి ప్రారంభమవుతుంది.
ఈ స్కూటర్‌లో ఎంత రేంజ్ లభిస్తుంది?
ఓలా S1 Xలో మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2, 3, 4 కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దీని 2 కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్‌తో 108 కిలోమీటర్లు, 3 కిలో వాట్స్బ్యాటరీ ప్యాక్‌తో 176 కిలోమీటర్లు, 4 కిలో వాట్స్బ్యాటరీ ప్యాక్‌తో 242 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. ఓలా S1 X ధర రూ. 79,999 నుండి ప్రారంభమవుతుంది.
ఓలా S1 X+ కేవలం 4 కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఈవీ సింగిల్ ఛార్జింగ్‌లో 242 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు125 కిమీ టాప్ స్పీడ్‌తో దూసుకుపోగలదు. ఓలా S1 X+ ప్రారంభ ధర రూ.1,07,999.
Also Read : లాంచ్ అయిన వెంటనే రికార్డు బుకింగ్స్ సాధించిన ఎలక్ట్రిక్ స్కూటర్