Investment:నేటి కాలంలో ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా ఉంటున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక భవిష్యత్ లో మరింత ఎక్కువగా ఉంటానయడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాల వారికి ఇప్పటి నుంచే డబ్బును కూడబెట్టే అవసరం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా డబ్బును పొదుపు చేయాల్సి ఉంటుంది. వారి చదువుతో పాటు పెళ్లిళ్ల అవసరాలు ఎక్కువగా ఉన్నందున వచ్చిన ఆదాయంలో ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయించాలి. ఇప్పటి నుంచి కొంత మొత్తం పెట్టుబడి పెడితే 21 సంవత్సరాల వరకు 71 లక్షలు పొందు మంచి పథకం అందుబాటులో ఉంది. ఆ పథకం వివరాల్లోకి వెళితే..
ఇప్పుడున్న చాలా మందికి ‘సుకన్య సమృద్ధి యోజన (SSY)’ గురించి తెలుసు. ఇందులో కొందరు పెట్టుబడి పెట్టారు కూడా. అయితే సుకన్య సమృద్ధి లో తక్కువ ప్రావిట్ ఉంటుందని చాలా మంది బావిస్తుంటారు. కానీ ఇందులో ప్రణాళిక ప్రకారం ఇన్వెస్ట్ మెంట్ పెట్టుకుంటూ పోతే ఊహించని లాభాలు ఉంటాయి. సుకన్య సమృద్ధి పథకంలో రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు. కానీ ఎక్కువ మంది ప్రతి నెల రూ.1000 నుంచి రూ.5 వేల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టారు.
మిగతా వాటిలో ఇన్వెస్ట్ మెంట్ చేసేకంటే ఇందులోనే ప్రతినెలా రూ.12,500 పెట్టుబడి పెడితే ఆశ్చర్యపోయే రాబటి ఉంటుంది. ఉదాహరణకు ప్రతినెలా రూ.12,500 మొత్తంతో 15 సంవత్సారాల పాటు ఇన్వెస్ట్ మెంట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ మొత్తం 22,50,000 అవుతుంది. దీనిపై 8.2 శాతం రాబటి ఉంటుంది. 21 సంవత్సరాల మెచ్యూరిటీ సమయానికి వడ్డీ 46,77,578 వస్తుంది. అసలు, వడ్డీ కలిపితే రూ.69,27,578 లక్షలు వస్తుంది.
కూతురు పుట్టినప్పటి నుంచి 21 సంవత్సరాల వరకు ఈ పెట్టుబడి పెడితే సరైన సమయంలో భారీ మొత్తంలో ఆదాయం పొందుతారు. మిగతా ఎలాంటి పెట్టుబడుల్లోనైనా ఇంత మొత్తంలో రాబడి ఉండదు. అందువల్ల సుకన్య సమృద్ధి పథకం ద్వారా కూతరు కోసం అధిక మొత్తం ఇన్వెస్ట్ మెంట్ చేసి భారీగా ఆదాయం పొందే అవకాశాన్ని కోల్పోకండి.