Gas Cylinders: మనలో దాదాపుగా చాలామంది గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తారు. అయితే గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో గ్యాస్ సిలిండర్లను తీసుకునే వాళ్లపై కూడా ఊహించని స్థాయిలో భారం పెరుగుతుండటం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్ లో గ్యాస్ సిలిండర్ ధర 884 రూపాయలుగా ఉండటం గమనార్హం. అందువల్ల గ్యాస్ సిలిండర్ పై 300 రూపాయల వరకు సబ్సిడీ లభిస్తోంది.
కొన్ని నెలల క్రితం వరకు సబ్సిడీ తక్కువగా ఉన్నా ఈ మధ్య కాలంలో సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డ్ తో లింక్ చేసుకుంటే మాత్రమే ఈ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ధరల వల్ల సామాన్య ప్రజలు ఊహించని స్థాయిలో ఇబ్బందులు పడుతుండటం గమనార్హం. ఉజ్వల పథకం కింద సిలిండర్ తీసుకున్న వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
Also Read: AP Cabinet Reshuffle: కొత్త వారికే జగన్ మంత్రివర్గంలో చాన్స్ దక్కనుందా?
గ్యాస్ సిలిండర్ ను కలిగి ఉండి ఖాతాలో సబ్సిడీ జమ కాని పక్షంలో సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించడం ద్వారా గ్యాస్ సబ్సిడీ డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది. త్వరగా గ్యాస్ సిలిండర్ ను బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. గ్యాస్ సిలిండర్ కంపెనీ వెబ్ సైట్ల ద్వారా సబ్సిడీకి సంబంధించిన పూర్తి సమాచారంను పొందవచ్చు.
సంబంధిత బ్యాంకును సందర్శించడం ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రభుత్వ స్కీమ్స్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.