RRR Movie: సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ ఆర్ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చి 25న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై మొదటి నుంచి వస్తున్న అనుమానాలు చాలా ఎక్కువే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉండడంతో ఎవరిని ఎక్కువ, తక్కువ చేసి చూపించినా ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతాయి అంటూ మొదటి నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఆర్.ఆర్ ఆర్ ప్రమోషన్స్ తో మళ్లీ హైప్ తీసుకువచ్చే పనిలో పడ్డారు మూవీ టీం. అయితే దర్శకుడు రాజమౌళి ఎక్కడికి వెళ్లినా ఆయనకు మొదటగా వచ్చే ప్రశ్న ఒక్కటే. ఎన్టీఆర్, రామ్ చరణ్ ను ఎలా బ్యాలెన్స్ చేశారు, ఫ్యాన్స్ మధ్య గొడవలు రాకుండా చూస్తున్నారా అని డైలాగులు ఆయనకు రొటీన్ గా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రామరాజు పాత్రకు రామ్ చరణ్ ను, భీం పాత్రకు ఎన్టీఆర్ ను తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అని రాజమౌళిని ఓ ఇంటర్వ్యూలో అడిగారు.
Also Read: Shahrukh Khan OTT Platform: ‘కింగ్ ఖాన్.. ఓటీటీ సామ్రాజ్యాన్ని ఏలబోతున్నాడు !
దీనికి జక్కన్న స్పందిస్తూ.. రామ రాజు పాత్ర అంటే గుండెల్లో అగ్నినీ దాచుకొని స్థితప్రజ్ఞతతో ఉండే వ్యక్తి కావాలని.. అలాంటి లక్షణాలు చరణ్ లో పుష్కలంగా ఉన్నాయని రాజమౌళి చెప్పారు. ఎలాంటి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా బెదరడు కాబట్టి చరణ్ ను ఆ పాత్రకు తీసుకున్నట్లు రాజమౌళి వివరించారు. ఇక భీం పాత్ర అంటే ఎంతో అమాయకంగా ఉండి, మనసులోని భావాలను దాచుకోకుండా చాలా ఓపెన్ గా ఉండే పాత్ర కావాలని తాను అనుకున్నట్లు రాజమౌళి వివరించారు.
ఈ పాత్రకు సరిగ్గా ఎన్టీఆర్ సరిపోతాడని, ఎలాంటి కల్మషం లేని వ్యక్తి ఎన్టీఆర్ అని అందుకే భీమ్ పాత్రకు తీసుకున్నట్లు రాజమౌళి చెప్పుకొచ్చారు. సినిమాల్లో హీరోలు అస్సలు కనబడరని, పాత్రలు మాత్రమే కనిపిస్తాయంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈ రెండు పాత్రల మధ్య బలమైన భావోద్వేగాలను రాబట్టడంలోనే తన పనితనం కనిపిస్తుంది అంటూ వివరించారు. ఎమోషన్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టానని, సినిమా చూస్తున్నంత సేపు ఎవరికీ హీరోలు గుర్తుకు రారు అంటూ రాజమౌళి స్పష్టం చేశారు.
Also Read: Allu Arjun Pushpa 3 Movie: ‘పుష్ప 3’లో హీరో విజయ్ దేవరకొండ.. మరి బన్నీ ఏమిటి ?