https://oktelugu.com/

One Idea: ఎన్ని లక్షల అప్పు అయినా సరే.. ఈ ఒక్క ఐడియాతో మాయం..

అప్పు ఎప్పటికైనా చేటు తెస్తుంది. కుటుంబాలను నాశనం చేస్తుంది. అప్పు స్వభావం పెరగడమే కానీ తరగడం ఉండదు. అందువల్ల ఈ ఒక్క ఐడియా పాటిస్తే అప్పు క్షణాల్లో పోతుంది. పైగా మనశ్శాంతితో మరింత ఎక్కువ సంపాదించుకునే ఉపాయం మీ కోసం..

Written By:
  • Mahi
  • , Updated On : September 30, 2024 6:58 pm
    One Idea

    One Idea

    Follow us on

    One Idea: అప్పు చేసి పప్పు కూడా సామెత ఎలా వచ్చిందో తెలుసు కదా.. కనీసం పప్పు కూర కూడా వండుకొని తినలేని వ్యక్తి అప్పు తెచ్చుకొని పప్పు కొని మరీ తింటాడు. ఆడంబరాలో.. వ్యసనాలో.. అవసరాలో.. కారణం ఏదైనా కావచ్చు అప్పు మనిషికి చేటే చేస్తుంది. అప్పు, లేదంటే ఈఎంఐలు, లోన్లు ఇవన్నీ ఒకే కేటరిగీ కిందకు వస్తాయి. ఒక వ్యక్తికి రూ. 50 లక్షల అప్పు ఉండి రూ. 2 కోట్ల వరకు ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీని కాపాడేందుకు ఆయన మరింత అప్పు చేస్తాడు. ఆ అప్పుకు వడ్డీ కట్టడం మనశ్శాంతి లేకపోవడంతో మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. ఇలా అతని పతనాన్ని అతనే కోరి తెచ్చుకుంటాడు. అప్పు ఉన్న వారికి ఆస్తులు ఉంచుకునే హక్కు లేదని పెద్దలు చెప్తుంటారు. ఈ విషయం గురించి మరింత లోతుగా పరిశీలిస్తే అప్పులు లేకుంటే మనిషి ప్రశాంతంగా బతకవచ్చు. లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఫలితంగా పెరిగిన లైఫ్ స్పాన్ లో మరింత డబ్బును సైతం కూడబెట్ట వచ్చు. అంటే రూ. 50 లక్షల అప్పుడు ఉన్న వ్యక్తి ఏం చేస్తే అప్పు పోతుంది..? ఆ తర్వాత అప్పుకంటే ఎక్కువగా ఎలా సంపాదిస్తారో ఈ కథనం చూసి తెలుసుకోండి.

    ఉదాహరణకు ఒక వ్యక్తికి అప్పు రూ. 50 లక్షల వరకు ఉంది. ఆయన నెల నెలా దాదాపు లక్షన్నరకు పైగానే వడ్డీల రూపంలో చెల్లిస్తున్నాడు. ఆయన దాని నుంచి బయట పడేందుకు రూ. 50 లక్షల చీటీ వేస్తున్నాడని అనుకుందాం. చీటి పాడితే కొంతలో కొంత కటింగ్ పోనూ రూ. 40 లక్షల వరకు (అంత రాదు) వస్తుందనుకుందాం. ఈ రూ. 40 లక్షలు అప్పులు కట్టగా.. రూ. 10 లక్షలు మిగిలే ఉంటుంది. అంటే పది లక్షలకు వడ్డీ కట్టాలి. పైగా లిఫ్ట్ చేసిన చిటీకి సంబంధించి నెల నెలా పే చేయాలి. అంటే బర్డెన్ మరింత పెరుగుతుంది.

    అదే ఆయన వద్ద ఉన్న రూ. 2 కోట్ల ఆస్తిలో రూ. 50 లక్షల వరకు అమ్మి అప్పు కట్టుకుంటే అప్పు క్లియర్ అవుతుంది. దీంతో మనశ్శాంతి కలుగుతుంది. వర్క్ పై ఎక్కువ ఫోకస్ చేయవచ్చు. ఫలితంగా ఉద్యోగాల్లో పై స్థాయికి వెళ్లవచ్చు. కంపెనీలు ఉంటే ఎక్కువ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయవచ్చు. మెంటల్ లెన్షన్ ఉండదు కాబట్టి లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఎక్కువ ఆర్జించవచ్చు. అమ్ముకున్న రూ. 50 ప్రాపర్టీకి బదులు రూ. కోటితో మరో ప్రాపర్టీ కూడా తీసుకోవచ్చు.

    అప్పు అనేది ఎప్పటికైనా ముప్పే కాబట్టి ఫస్ట్ ప్రాపర్టీ అమ్ముకోనైనా సరే అప్పు కట్టుకోవాలి. అప్పు కట్టుకున్న తర్వాత ఆనందంగా సంపాదించవచ్చు.