Nissan
Nissan : నిస్సాన్ మోటార్ ఇండియా తన లైనప్ లో మరో రెండు కొత్త కార్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇటీవల జపాన్‌లోని యోకోహామాలో నిర్వహించిన గ్లోబల్ ప్రొడక్ట్ షోకేస్ ఈవెంట్‌లో ఇండియన్ మార్కెట్ కోసం ఈ రెండు కొత్త ప్రొడక్ట్ లను ప్రదర్శించింది. విశేషం ఏమిటంటే, నిస్సాన్ రెనో ట్రైబర్ ఆధారిత ఎంపీవీ టీజర్‌ను విడుదల చేయడంతో పాటు హ్యుందాయ్ క్రెటాకు పోటీగా ఒక సరికొత్త కాంపాక్ట్ SUVని తీసుకురానున్నట్లు సిగ్నల్ ఇచ్చింది.
ప్రస్తుతం నిస్సాన్ ఇండియాలో కేవలం మాగ్నైట్ అనే ఒకే ఒక్క కారును విక్రయిస్తోంది. మాగ్నైట్ కారణంగానే ప్రపంచ స్థాయిలో పోరాడుతున్న నిస్సాన్‌కు కొత్త పవర్ లభించింది. ఇప్పుడు అందుబాటు ధరలో మరో 2 ఉత్పత్తులను ప్రకటించడంతో నిస్సాన్ భారతీయ మార్కెట్‌పై తనకున్న పట్టును మరింత బలపరుచుకోవాలని చూస్తోంది. క్రెటాకు ప్రత్యర్థిని డెవలప్ చేయడంతో నిస్సాన్ భారతీయ వినియోగదారుల దృష్టిని ఆకర్షించాలని చూస్తుంది.
Also Read : నిస్సాన్ కిక్స్.. క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్..సేఫ్టీలో దుమ్మురేపిన ఎస్యూవీ !
నిస్సాన్ రెనో ట్రైబర్ ఆధారంగా ఒక ఎంపీవీని కూడా తయారు చేయబోతుంది. ఇది ట్రైబర్ రీబ్యాడ్జ్డ్ వెర్షన్ అవుతుంది. ట్రైబర్ ఒక మంచి 7 సీటర్ కారు. ఇది తక్కువ బడ్జెట్ కలిగిన ఫ్యామిలకు చాలా దగ్గరౌంది. టీజర్‌లో చూసినట్లయితే.. ముందు భాగం చాలా వరకు ట్రైబర్‌ను పోలి ఉంది, అయితే కొత్త గ్రిల్‌ను కలిగి ఉంది. అయితే, ఇంటీరియర్ , ఫీచర్లు కొద్దిగా భిన్నంగా ఉండే ఛాన్స్ ఉంది. దీనితో పాటు కొత్త MPVలో బలమైన 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉండవచ్చు, ఇది ఇప్పటివరకు ట్రైబర్‌లో లేదు. ట్రైబర్ ఆధారిత MPV ఈ సంవత్సరం చివరి నాటికి భారతీయ మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ 7 సీటర్ కారు భారతీయ మార్కెట్‌లో మారుతి సుజుకి ఎర్టిగాకు గట్టి పోటీనిస్తుంది.
అలాగే జపనీస్ బ్రాండ్ క్రెటా ప్రత్యర్థి గురించి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం కాంపాక్ట్ SUV విభాగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో పనిచేసే బ్రాండ్‌లకు అత్యధిక లాభాలు వస్తాయి. క్రెటా ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు. మార్కెట్‌పై దాని పట్టు చాలా బలంగా ఉంది. నిస్సాన్ ధర, ఫీచర్లు, డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్ల విషయంలో క్రెటాకు గట్టి పోటీనిచ్చే వాహనాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. నిస్సాన్ భారతదేశంలో BS6 ప్రమాణాల కారణంగా చాలా కాలం క్రితమే డీజిల్ కార్లను నిలిపివేసింది. కాబట్టి తమను తాము ప్రత్యేకంగా నిలబెట్టుకోవడానికి.. మైలేజ్ పట్ల శ్రద్ధ చూపే భారతీయ వినియోగదారులను ఆకర్షించడానికి హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందించే అవకాశం ఉంది. క్రెటా ప్రత్యర్థి వాహనం 2027 నాటికి భారతీయ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read : స్విఫ్ట్, వెర్నా, ఎలివేట్లన్నీ వెనుకే.. ఎగుమతుల్లో నెంబర్ 1గా నిలిచిన నిస్సాన్ కారు
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Nissan master plan check ertiga
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com