Nissan Gravite: కొత్తగా కారు కొనాలని అనుకునేవారు నేటి కాలంలో ఎక్కువగా 7 సీటర్ పై ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి కుటుంబంతో కలిసి సుదూర ప్రయాణాలు చేయడానికి ఈ రకమైన కారు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా సెడాన్, హ్యాచ్ బ్యాక్ కార్ల కంటే ఇందులో విశాలమైన క్యాబిన్ ఉండడంతోపాటు ఇంజన్ పనితీరు కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చే 7 సీటర్ కార్లు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిస్సాన్ కంపెనీ ఓ సెవెన్ సీటర్ కారును అత్యంత తక్కువ ధరకే అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రముఖ కంపెనీ Nissan గురించి కార్ల వినియోగదారులకు తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ లేటెస్ట్ గా Gravite అనే మోడల్ ను ఇటీవల రిలీజ్ చేసింది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన స్మార్ట్ ఫీచర్లను అమర్చారు. అంతేకాకుండా డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంది. దీని ఎక్స్టీరియర్ డిజైన్ లో భాగంగా హెక్సాగాన్ గ్రిల్ ప్రత్యేకంగా ఉంటుంది. 15 అంగుళాల స్టీల్ వీల్స్ టైర్లకు ఆకర్షణను తెస్తాయి. ఎలాంటి రోడ్లపై ప్రయాణించినా కూడా సులభంగా ప్రయాణించేందుకు ఇవి అనుగుణంగా ఉంటాయి. ఈ కారులో 625 లీటర్ల వరకు బూట్ స్పేస్ ఉండడంతో లాంగ్ జర్నీ చేసిన కూడా ఎలాంటి అలసట ఉండదు. ఈ కారు ఇంటీరియర్ డిజైన్ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. వైర్లెస్ చార్జింగ్ సదుపాయం, ఏసీవెంట్లు, వాయిస్ కమాండింగ్, AI వాయిస్ అసిస్టెంట్ ఉన్నాయి. అలాగే స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ తో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టం లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకొని ఉంది.
నిస్సాన్ గ్రావెటి మిగతా కార్ల కంటే భిన్నమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఇంజన్ పనితీరుకు కూడా మెరుగ్గానే ఉంది. ఈ కారులో 1.0 లీటర్ త్రీ సిలిండర్ నేచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ 72hp పవర్ ను, 96 ఎం టార్క్ను రిలీజ్ చేస్తుంది. ఇది ఆటోమేటిక్ గేర్ బాక్స్ లేదా మాన్యువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. లీటర్ ఇంధనానికి మాన్యువల్ వేరియంట్ లో 19.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ వేరియంటులో 19.6 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఒకవైపు నగర ప్రయాణికులకు అనుకూలంగా ఉంటూనే మరోవైపు లాంగ్ జర్నీ చేసే వారికి కూడా సపోర్ట్ ఇస్తుంది.
ఈ కారులో సేఫ్టీ ఫీచర్లు కూడా ప్రత్యేకంగా అమర్చారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ తో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ ఆప్షన్ చేర్చారు. 6 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు EBD తో కూడిన ABS ఉండనుంది. దీనిని ప్రస్తుతం రూ. 5.65 లక్షలు గా విక్రయిస్తున్నారు. అయితే ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని కంపెనీ ప్రతినెలు తెలుపుతున్నారు.