Nissan : ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి ఫ్రాంక్స్, టాటా పంచ్ వంటి కార్లకు పోటీగా నిలిచిన నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ SUVపై ఏప్రిల్ నెలలో ఏకంగా 65 వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. నిస్సాన్ మోటార్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది. మాగ్నైట్‌పై 55 వేల రూపాయల వరకు తగ్గింపుతో పాటు, అదనంగా 10 వేల రూపాయల వరకు కార్నివాల్ బెనిఫిట్ కూడా ఇస్తోంది. నిస్సాన్ హ్యాట్రిక్ కార్నివాల్ ఏప్రిల్ 30, 2025 వరకు కొనసాగుతుంది. అంతేకాదు, కంపెనీ ప్రతి కస్టమర్‌కు ఒక బంగారు నాణేన్ని కూడా ఉచితంగా అందిస్తోంది.
Also Read : ధరల బాదుడు.. ఆఫర్ల ఊరట! మారుతి ఏం చేస్తుందో దానికే తెలియాలి!
నిస్సాన్ మాగ్నైట్ మనదేశంలో కంపెనీ విక్రయిస్తున్న ఏకైక కారు. 2017-18 ఆర్థిక సంవత్సరం తర్వాత దీని అమ్మకాలు నిరంతరం పెరుగుతూ వస్తున్నాయి. అక్టోబర్ 2024లో అప్‌డేట్ చేసిన వెర్షన్‌లో విడుదలైన ఈ SUV, దేశీయ విక్రయాలు, ఎగుమతులు రెండింటినీ పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో నిస్సాన్ మాగ్నైట్‌ను 99,000 మంది కొనుగోలు చేశారు. ఇందులో ఎగుమతులు, దేశీయ అమ్మకాలు రెండూ కలిపి ఉన్నాయి.
నిస్సాన్ మాగ్నైట్ ఫీచర్లు
2024 నిస్సాన్ మాగ్నైట్‌లో కొన్ని కాస్మెటిక్ మార్పులు, కొత్త ఫీచర్లను అందించారు. ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ముందున్న ఇంజన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లే ఉన్నాయి. నిస్సాన్ మాగ్నైట్ బేస్ మోడల్ ధర 6.14 లక్షల రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ మోడల్ ధర 11.92 లక్షల రూపాయల(ఎక్స్-షోరూమ్ ధర) వరకు ఉంటుంది.
ఇంజిన్, మైలేజ్:
నిస్సాన్ మాగ్నైట్‌లో 1 పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ పెట్రోల్ ఇంజన్ 999సీసీ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. వేరియంట్, ఫ్యూయల్ రకాన్ని బట్టి మాగ్నైట్ మైలేజ్ లీటరుకు 17.9 నుంచి 19.9కిమీ వరకు ఉంటుంది. మాగ్నైట్ గ్రౌండ్ క్లియరెన్స్ 205ఎంఎం. ఇది 5 సీట్ల 3 సిలిండర్ల కారు. దీని పొడవు 3994ఎంఎం, వెడల్పు 1758ఎంఎం, వీల్‌బేస్ 2500ఎంఎం.
పోటీదారుల కంటే తక్కువ ధర
2024 నిస్సాన్ మాగ్నైట్ 5-సీటర్ సబ్‌కాంపాక్ట్ SUV. ఇది తన పోటీదారుల కంటే చాలా తక్కువ ధరలో లభిస్తుంది. రోజువారీ ఉపయోగం కోసం అవసరమైన అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్ దీని స్టైలింగ్‌కు కొత్త రూపాన్ని ఇచ్చింది. మాగ్నైట్‌లో నేచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌లు రెండూ ఉన్నాయి. ఇవి మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి.
Also Read : పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ.. ఏ కారు కొన్నా రూ.1.35 లక్షల డిస్కౌంట్