Maruti Suzuki Swift Hybrid: దేశీయ కార్ల ఉత్పత్తిల్లో మారుతి సుజుకి అగ్రగామిగా నిలుస్తోంది. ట్రెండ్ కు తగిన విధంగా కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. మారుతి సుజుకీ నుంచి రిలీజైన స్విప్ట్.. ది బెస్ట్ కారుగా నిలిచింది. హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో వచ్చిన స్విప్ట్ ను ఇప్పటికే చాలా మంది వినియోగదారులు సొంతం చేసుకొన్నారు. అయితే ఇప్పుడు SUV వేరియంట్ లోనూ స్విప్ట్ ను తయారు చేశారు. ఆకర్షణీయమైన లుక్ తో పాటు అప్డేట్ ఫీచర్స్ తో అందుబాటులోకి వస్తున్న మారుతి స్విప్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..
మారుతి సుజుకీ నుంచి స్విప్ట్ హైబ్రిడ్ పేరుతో మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పటికే కొందరు ఆన్లైన్లో పెట్ేశారు. పాత స్విప్ట్ తో పోలిస్తే కొత్తదానిలో చాలా మార్పులు చేశారు. ఇంజన్ లోనూ మార్పులు చేసి అప్ గ్రేడ్ చేశారు. భారీ మైలేజ్ ఇచ్చేలా డిజైన్ చేసి ఇంటీరియల్, ఎక్సీటీరియల్ లో మార్పులు చేశారు. హ్యాచ్ బ్యాక్ స్విప్ట్ మాదిరిగా కాకుండా ఎస్ యూవీ స్వీప్ట్ ఆకర్షణీయమైన లుక్ లో కనిపిస్తుంది.
నేటి కాలంలో ఎక్కువ మంది SUV ని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మారుతి కంపెనీ SUV ఉత్పత్తిపై ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పటికై సక్సెస్ అయినా స్విప్ట్ ను మార్పు చేసి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ మోడల్ 1,2 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ ను కలిగి ఉంది. మైలేజ్ విషయంలోనూ మెరుపువేగంతో దూసుకుపోయేలా సెట్ చేశారు. ఈ కారు మైలేజ్ లీటర్ కు 40 కిలోమీటర్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు.
పాత స్విప్ట్ రూ.5 నుంచి 8 లక్షలకు వరకు విక్రయించారు. ఇప్పుడు ఎస్ యూవీ స్విప్ట్ ను రూ.10 లక్షల ధరకు నిర్ణయించారు. బ్లాక్ అవుట్ పిల్లర్, వీర్ ఆర్చ్, ఫాక్స్ ఎయిర్ వెంట్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటి ఫీచర్లతో ఆకర్షిస్తున్న ఈ కారు త్వరలోనే మార్కెట్లోకి రానుంది. అయితే ఎప్పుడు? అనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ మోడల్ ను మాత్రం పరిచయం చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. మారుతి కార్లపై మక్కువ పెంచుకున్నవాళ్లు… ఎస్ యూవీ కోసం చూసేవాళ్లకు మాత్రం ఈ కారుల బెస్ట్ ఆప్షన్ గా పేర్కొంటున్నారు.