Hyundai Exter SUV: హ్యుందాయ్ నుంచి న్యూ SUV మోడల్.. ధర ఎంతో తెలుసా?

ఆన్లైన్లో ఉన్న సమాచారం ప్రకారం.. హ్యుందాయ్ ఎక్స్ టర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. పవర్ ట్రెయిన్ 82 బీహెచ్ పీ, గరిష్టంగా 114 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాయ్ వీల్స్ తో కూడాని స్క్వేర్డ్ వీల్ దీనికి అమర్చారు. ఫ్రంట్ లో ఎల్ ఈడీ యూనిట్ తరహా హెడ్ లైట్స్ ఉన్నాయి. ఫ్రంట్ లైట్స్ కి ఇవి ఇన్నట్లు డిజైన్ రెండర్ లో తెలుస్తోంది. ఎస్ యూవీ రేర్ లో టెయిల్ టైట్స్ ను కనెక్ట్ చేస్తూ పారామెట్రిక్ పాటర్న్ తో కూడిన గ్రిల్ ఉంటుంది.

Written By: Chai Muchhata, Updated On : June 3, 2023 8:56 am

Hyundai Exter SUV

Follow us on

Hyundai Exter SUV: ఆటో మొబైల్ రంగంలో SUV కార్ల హవా సాగుతోంది. చాలా మంది కారుపై మోజు ఉన్నవారు ఈ మోడల్ కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కంపెనీలు కూడా వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వివిధ మోడళ్లను తయారు చేస్తూ మార్కెట్లోకి వదులుతున్నాయి. లేటేస్టుగా హ్యుందాయ్ కంపెనీ కొత్త కారును త్వరలో రోడ్లపై తిప్పనుంది. దీనికి ఎక్స్ టర్ అని పేరు పెట్టింది. అయితే ఇప్పటికే ఈ వెహికిల్ డిటేయిల్స్ ఆన్లైన్లో ఉంచింది. అద్భుతమైన ఫీచర్లతో పాటు ఆకర్షణీయమైన ధర ఉండడంతో చాలా మంది ఇప్పటికే బుక్ చేసుకున్నారు. అన్నీ కుదిరితే జూలై 10న హ్యుదాయ్ ఎక్స్ టర్ ను విక్రయించేందుకు రెడీ చేస్తున్నారు. ఈ తరుణంలో దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

ఆన్లైన్లో ఉన్న సమాచారం ప్రకారం.. హ్యుందాయ్ ఎక్స్ టర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. పవర్ ట్రెయిన్ 82 బీహెచ్ పీ, గరిష్టంగా 114 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాయ్ వీల్స్ తో కూడాని స్క్వేర్డ్ వీల్ దీనికి అమర్చారు. ఫ్రంట్ లో ఎల్ ఈడీ యూనిట్ తరహా హెడ్ లైట్స్ ఉన్నాయి. ఫ్రంట్ లైట్స్ కి ఇవి ఇన్నట్లు డిజైన్ రెండర్ లో తెలుస్తోంది. ఎస్ యూవీ రేర్ లో టెయిల్ టైట్స్ ను కనెక్ట్ చేస్తూ పారామెట్రిక్ పాటర్న్ తో కూడిన గ్రిల్ ఉంటుంది.

అన్ని వేరియంట్లకు ఎయిర్ బ్యాగులను అమర్చారు. మారుతి సుజుకి ఫ్రాంక్స్ వంటి కార్లకు గట్టి పోటీనిచ్చేందుకు మార్కెట్లోకి వ్తుంది. ఇక హ్యుందాయ్ ఎక్స్ టర్ రూ.6 లక్షల నుంచి రూ.9 .50 లక్షల వరకు రేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మోడల్ EX, S, SX, SX(0) అనే ఐదు వేరియంట్లలో లభించే అవకాశం ఉంది. డీలర్ షిప్ లో కారును బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే SUV కోరుకునేవారు దీనిపైనే ఎక్కువగా మనసుపెడుతున్నారు.

సౌత్ కొరియాకు చెందిన ఈ కంపెనీ నుంచి రిలీజ్ కాబోతున్న ఈ మోడల్ కంపెనీకి హైలెట్ గా నిలవనుంది. వెన్యూ, క్రేటా వంటి SUV మోడళ్లకు గట్టి పోటీనిచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఎక్స్ టర్ పై భారీ ఆశలు పెట్టుకున్న కంపెనీ జూలై లో రిలీజ్ చేయడానికి సన్నద్ధం అవుతోంది. రిలీజ్ అయిన తరువాత దీనిని యూత్ ఎక్కువగా ఆదరిస్తారని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు.