Social Media viral: ఏబీఎన్ రాధాకృష్ణకే చెమటలు పట్టించావు.. మాట్లాడకుండా చేశావు.. ఎవడ్రా నువ్వు!

ట్విట్టర్లో Vishnu Reddy BRS అనే ఐడీ లో ఓ వీడియో పోస్ట్ అయింది. అందులో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల అధిపతి వేమూరి రాధాకృష్ణ విద్యార్థులతో చర్చా వేదిక నిర్వహిస్తున్నారు. బహుశా ఈ కార్యక్రమం "యంగిస్థాన్" అయి ఉంటుంది. అప్పట్లో పేరుపొందిన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు

Written By: Bhaskar, Updated On : July 16, 2024 8:06 pm
Follow us on

 

Social Media viral : వెనకటికి రామ్ నాథ్ గోయెంకా అనే సుప్రసిద్ధ వ్యాపారి ఉండేవారు. ఆయన ఆ రోజుల్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేరుతో ఓ పత్రికను నడిపేవారు. ఇంగ్లీషులో ప్రచురితమవుతున్నప్పటికీ.. దేశంలోనే అత్యధిక సర్కులేషన్ కలిగిన పత్రికగా దానికి పేరు ఉండేది. నిజాలను నిష్పక్షపాతంగా.. వార్తలను నిర్భయంగా రాస్తుందనే పేరు ఆ పత్రికకు ఉండేది. పైగా ఆ పత్రిక యజమాని రామ్ నాథ్.. దాని వ్యవహారాలలో వేలు పెట్టేవారు కాదు. చివరికి ఎరిటోరియల్ విషయంలో కూడా కలగజేసుకొనేవారు కాదు. అందువల్లే ఇండియన్ ఎక్స్ ప్రెస్ గొప్ప పత్రికగా పేరుపొందింది. చివరికి రామ్ నాథ్ తన మనవరాలి పెళ్లి వార్తను కూడా పత్రికలో వేయించకుండా నిరాడంబరతను ప్రదర్శించాడు రామ్ నాథ్. అయితే అంతటి గొప్ప యాజమాన్యాన్ని నేటి రోజుల్లో చూడగలమా? అంటే ఈ ప్రశ్నకు లేదు అనే సమాధానం వస్తుంది. పైగా నేటి మీడియా ఆధిపతులు అడ్డగోలు సంపాదనకు అలవాటు పడటం వల్ల ప్రజల ముందు ఆభాసు పాలు కావాల్సి వస్తోంది. వెనుకటి రోజుల్లో అంటే సోషల్ మీడియా బలంగా లేదు కాబట్టి ఇలాంటి విషయాలు పెద్దగా వెలుగులోకి వచ్చేవి కాదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా అత్యంత ప్రబలంగా ఉన్న నేపథ్యంలో మీడియా ఆధిపతుల అసలు భాగోతాలు వెలుగు చూస్తున్నాయి.

సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వీడియో ప్రకారం..

ట్విట్టర్లో Vishnu Reddy BRS అనే ఐడీ లో ఓ వీడియో పోస్ట్ అయింది. అందులో ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థల అధిపతి వేమూరి రాధాకృష్ణ విద్యార్థులతో చర్చా వేదిక నిర్వహిస్తున్నారు. బహుశా ఈ కార్యక్రమం “యంగిస్థాన్” అయి ఉంటుంది. అప్పట్లో పేరుపొందిన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఈ కార్యక్రమానికి ఎవరో ఒక రాజకీయ నాయకుడిని అతిథిగా పిలిచేవారు. సందర్భంగా వచ్చిన వక్తలను విద్యార్థులతో ప్రశ్నలు సంధింపచేసేవారు. అయితే అప్పట్లో యంగిస్థాన్ కార్యక్రమంలో ఓ విద్యార్థి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణను నేరుగా ప్రశ్నించాడు.. అప్పట్లో ఈ విషయాన్ని ఏబీఎన్ ప్రసారం చేయలేదు గాని.. ఆ వీడియోను ఎవరో తమ ఫోన్ లో రికార్డ్ చేసి.. తర్వాత ఇన్నాళ్లకు తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు.

ఆ విద్యార్థి ఏమడిగాడంటే..

యంగిస్థాన్ కార్యక్రమంలో ఓ విద్యార్థి తన ప్రశ్నలతో వేమూరి రాధాకృష్ణను కడిగిపారేశాడు..”దమ్మున్న ఛానల్ ఏబీఎన్ ను మీరు ఎలా ఏర్పాటు చేశారు? ఒక పత్రికలో బీట్ రిపోర్టర్ గా పనిచేసిన మీరు ఛానల్ నెలకొల్పే స్థాయికి ఎలా ఎదిగారు. ఇక్కడ ఇంతమంది యువకులం ఉన్నాం. ఆ వ్యాపార పాఠాలు ఏమిటో మాకు కూడా చెప్తే బాగుంటుంది.. గతంలో చంద్రబాబు నాయుడు టిడిపిలో కుంపటి రాజేసినప్పుడు ఎమ్మెల్యేలతో మీరు బేరసారాలు చేశారట కదా” అని ఆ విద్యార్థి ప్రశ్నించాడు..

నీళ్లు నమిలాడు

సహజంగానే ఎదుటి వ్యక్తులను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే వేమూరి రాధాకృష్ణ.. ఆ విద్యార్థి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో నెటిజన్లు వారిదైన శైలిలో స్పందిస్తున్నారు. ” దమ్మున్న ఛానల్, దమ్మున్న పత్రిక అని చెబుతుంటాడు కదా.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలడా.. సమాధానాలు చెప్పలేడు.. ఎందుకంటే ఆ పత్రికను ఎలా కొనుగోలు చేశాడో? ఆ ఛానల్ ఎలా ఏర్పాటు చేశాడో అందరికీ తెలుసు అని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.