https://oktelugu.com/

Whats app లో కొత్త ఫీచర్.. ఇక వాటిని బోల్డ్ చేసుకోవచ్చు..

ఒకరికి మెసేజ్ పంపించుకోవాలంటే సాధారణ టెక్ట్స్ లోనే ఇప్పటి వరకు పంపించుకునే అవకాశం ఉండేది. అందులోని కొన్ని పదాలను హైలెట్ చేయడానికి ఆస్కారం ఉండేది కాదు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 23, 2024 / 10:18 AM IST

    Whats app new feature

    Follow us on

    Whats app: మెసేజ్ పంపించుకోవడంలో అత్యంత ప్రాధాన్యతను కలిగింది Whats app. ప్రపంచంలో అత్యధికంగా వినియోగిస్తున్న వాట్సాప్ లో ఎప్పటికపపుడు కొత్త కొత్తఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీని మాతృసంస్థ మెటా వినియోగదారులనుఆకర్షించేందుకు వారికి అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటోంది. తాజాగా ఆకర్షించే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఒకరికి మెసేజ్ పంపించుకోవాలంటే సాధారణ టెక్ట్స్ లోనే ఇప్పటి వరకు పంపించుకునే అవకాశం ఉండేది. అందులోని కొన్ని పదాలను హైలెట్ చేయడానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ ఇప్పుడు దానితో పాటు మరికొన్ని ఫీచర్లను తీసుకొచ్చింది. అవేంటంటే?

    కమ్యూనికేషన్ వ్యవస్థలో అత్యంత వేగంగా మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు వెళ్లేది వాట్సాప్ లోనే. అందుకే చాలా మంది దీనిని యూజ్ చేస్తున్నారు. కేవలం యువత మాత్రమే కాకుండా ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల వారు వాట్సాప్ లో ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాటు చేసుకొని మెసేజ్ లు చేస్తుంటారు. కొందరు వాట్సాప్ ద్వారా వ్యాపారాలు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అయితే వీరికి అనుగుణంగా వాట్సాప్ ఫీచర్లను తీసుకొస్తుంది.

    లేటేస్టుగా వాట్పాప్ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక మెసేజ్ ను ఇతరులకు పార్వార్డ్ చేసేటప్పుడు అందులోని కొన్ని విషయాలను హైలెట్ చేయడం ఇప్పటి వరకు కుదరదు. ఉదాహరణకు ఒక మెసేజ్ లోని ఓ పదం బోల్డ్ కావడానికి దానిని థిక్ నెస్ చేసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు చేసుకోవచ్చు. అలాగే కొన్ని పదాలను ఇటాలిక్ గా మార్చాలంటే కూడా సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు చేయొచ్చు. అయితే వీటిని అలా మార్చుకోవాలంటే కొన్ని కీ స్ ను టైప్ చేయాల్సి ఉంటుంది.

    ఒక పదం బోల్డ్ కావడానికి ఆ పదం ముందు *..* ఇలా రెండు వైపులా స్టార్ ను ప్రెస్ చేయాలి. దీంతో ఆ పదం వెంటనే బోల్డ్ గా మారుతుంది. అలాగే ఇటాలిక్ కోసం _word_ టైప్ చేయాలి. మోనోస్కోప్ కోసం “‘Word”‘ అని టైప్ చేయాలి. బ్లాక్ కోట్స్ కోసం >Word అని టైప్ చేయాలి. బుల్లెట్ కావడానికి -word అని టైప్ చేయాలి. ఈ సౌకర్యం వర్డ్ సాప్ట్ వేర్ లో మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తీసుకురావడంతో కొందరు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.