https://oktelugu.com/

Namratha Goda: లో బడ్జెట్ కారు కొన్న ప్రముఖ నటి.. ఎందుకో తెలుసా?

MG Commet ఈవీ కారు 17.3kW బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. ఇది 42 బీహెచ్ పీ పవర్, 110 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 18, 2024 / 08:52 AM IST

    Mg Commet Namrata goud

    Follow us on

    Namratha Goda:  ఎలక్ట్రిక్ కార్లకు ఈమధ్య డిమాండ్ బాగా పెరిగిపోతుంది. వాతావరణ కాలుష్యంతో పాటు చమురు ధరలు పెరిగిపోతుండడంతో చాలా మంది పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా ఉండే వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సైతం ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించడంతో వీటి అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఎలక్ట్రిక్ కార్లలో వివిధ వేరియంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆకర్షణీయమైన కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి మిగతా కంపెనీలు పోటీ పడి కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. లేటేస్టుగా MG మోటార్స్ కు చెందిన Commet అనే కారు గురించి తీవ్రంగా చర్చ సాగుతోంది. దీనిని ఇటీవల ఓ ప్రముఖ నటి సొంతం చేసుకుంది. మరి ఈ కారు ఎలా ఉందంటే?

    కన్నడ సీరియల్స్ లో పాపులర్ అయిన ప్రముఖ నటి, బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ నమ్రత గౌడ కు ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలో నిత్యం ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంటారు. పర్సనల్ విషయాలను ఎప్పటిప్పుడు షేర్ చేసుకుంటారు. లేటేస్టుగా ఆమె కొత్త కారు కొన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. సాధారణంగా సెలబ్రెటీలు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తుంటారు. కానీ నటి నమ్రత గౌడ్ ఎస్ యూవీ అయిన MG Commet ను కొనుగోలు చేశారు. ఇది చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

    Mg Commet Namrata goud 2

    MG Commet ఈవీ కారు 17.3kW బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. ఇది 42 బీహెచ్ పీ పవర్, 110 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ మోడల్ క్యాండీ వైట్, స్ట్రార్రీ బ్లాక్ అనే డ్యూయెల్ టోన్ కలర్లలో లభిస్తుంది. విహార యాత్రలకు, దూరపు ప్రయాణాలు మాత్రమే కాకుండా డైలీ అవసరాలకు దీనిని అనుగుణంగా వినియోగించుకోవచ్చు.

    ఎలక్ట్రిక్ వేరియంట్ అయినా.. ఎంజీ కామెట్ లో బడ్జెట్ లోనే లభ్యం కానుంది. దీని ప్రారంభ ధర రూ.6.99 లక్షలుగా ఉంది. టాప్ మోడల్ రూ.9.24 లక్షల వరకు కొనుగోలు చేయవచ్చు. 2 డోర్స్ కలిగిన ఇందులో నలుగురు ప్రయాణికులు సురక్షితంగా వెళ్లొచ్చు. భారత మార్కెట్లో ఈ మోడల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో ఒకటి ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్స్ క్లూసివ్ ఉన్నాయి. నటి నమ్రత గౌడ ఈ కారుతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నమ్రత ఈ కారుపై మనసు పడి మరీ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ కారులో బెస్ట్ ఫీచర్స్ తో పాటు సౌకర్యవంతంగా ఉండడంతో లో దీనిని సొంతం చేసుకున్నారు.