Anant Ambani – Radhika Merchant : ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి.. అగ్గి మీద గుగ్గిలమవుతున్న ముంబై నగరవాసులు..

Anant Ambani - Radhika Merchant ఇక అనంత్ అంబానీ పెళ్లి కోసం దాదాపు 1500 కోట్ల దాకా ముఖేష్ అంబానీ ఖర్చు పెడుతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అనంత్ వివాహాన్ని పురస్కరించుకొని ముఖేష్ అంబానీ కుటుంబం పలు పేద కుటుంబాలకు చెందిన వారికి పెళ్లి తంతు నిర్వహించింది. వారికి ఖరీదైన కానుకలు అందించింది. అంతేకాదు లక్ష రూపాయల చెక్కు కూడా ఇచ్చింది. అద్భుతమైన విందు భోజనం పెట్టింది. అంతకుముందు మార్చి నెలలో అంబానీ కుటుంబం మూడు రోజులపాటు గుజరాత్ లో ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించింది. ఆ వేడుకల్లో ప్రముఖ పాప్ గాయని రియన్నా ఆడి పాడింది.

Written By: NARESH, Updated On : July 8, 2024 3:44 pm

Mukesh Ambani's wedding at home brings hardship to Mumbai residents

Follow us on

Anant Ambani-Radhika Merchant : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా.. పోనీ నిజ జీవితంలో మీకు ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చిందా.. మీ సంగతేమో గాని ముంబై నగర వాసులకు మాత్రం అది కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

భారతదేశ కుబేరుడిగా పేరుపొందిన ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి చేయబోతున్నాడు. జూలై 12న ముంబై మహానగరంలోని బాంద్రా – కుర్లా కాంప్లెక్స్ లో అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు ఇందుకు సంబంధించి ముఖేష్ అంబానీ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటికే నిర్వహించిన సంగీత్ వేడుక న భూతో న భవిష్యత్ అన్నట్టుగా సాగింది. ఈ కార్యక్రమానికి మనదేశంలోని సెలబ్రిటీలు హాజరయ్యారు. అనంత అంబానీ వివాహ వేడుకకు సంగీత ప్రదర్శన ఇచ్చేందుకు ప్రఖ్యాత పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ వచ్చాడు.

ఇక అనంత్ అంబానీ పెళ్లి కోసం దాదాపు 1500 కోట్ల దాకా ముఖేష్ అంబానీ ఖర్చు పెడుతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అనంత్ వివాహాన్ని పురస్కరించుకొని ముఖేష్ అంబానీ కుటుంబం పలు పేద కుటుంబాలకు చెందిన వారికి పెళ్లి తంతు నిర్వహించింది. వారికి ఖరీదైన కానుకలు అందించింది. అంతేకాదు లక్ష రూపాయల చెక్కు కూడా ఇచ్చింది. అద్భుతమైన విందు భోజనం పెట్టింది. అంతకుముందు మార్చి నెలలో అంబానీ కుటుంబం మూడు రోజులపాటు గుజరాత్ లో ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించింది. ఆ వేడుకల్లో ప్రముఖ పాప్ గాయని రియన్నా ఆడి పాడింది.

ఇక ఈనెల 12న ముంబైలోని బాంద్రా – కుర్లా కాంప్లెక్స్ లో అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహం జరగనుంది. ఈ వివాహం నేపథ్యంలో జూలై 12 నుంచి 15 వరకు ముంబై నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి ముంబై పోలీసులు ఒక సర్క్యులర్ జారీ చేశారు. “ప్రజా కార్యక్రమం ఉండడంవల్ల జూలై 12 నుంచి 15 వరకు పలు మార్గాలలో ట్రాఫిక్ మళ్లిస్తాం. ప్రజలు సహకరించాలని” పోలీసులు ఆ సర్క్యులర్ లో కోరారు. పోలీసులు జారీచేసిన ఈ సర్క్యులర్ పై ముంబై నగర ప్రజలు మండిపడుతున్నారు. “వారెవరి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మాకేంటి సంబంధం. అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. దానికి ప్రజా కార్యక్రమం అని పోలీసులు ఎలా పేరు పెడతారు? అంటే ఆ మూడు రోజులపాటు మేము ముంబై నగరంలో ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కోవాలా? ఇది సరైన పద్ధతి కాదంటూ” ముంబై వాసులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ముంబై పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై ముంబై పోలీసులు పునరాలోచన చేస్తారా? లేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.