Dishes Wash : రాత్రి తిన్న తర్వాత పడుకోవాలి అనిపిస్తుంది చాలా మందికి. ఇక ఆలస్యంగా అన్నం తినేవారు అయితే ఏ పని చేయకుండా తినగానే పడుకుంటారు. ఇలా తిని పడుకోవడం వల్ల సమస్యలే వస్తాయి. మరో వైపు తిన్న గిన్నెలు తోమకుండా పడుకున్నా సమస్యలే వస్తాయి. ఉదయం తోముదాం లే అని లైట్ తీసుకుంటున్నారా? మరి మీరు డేంజర్ లో ఉంటున్నారనే విషయం మీకు తెలుసా? అయితే ఓ సారి ఈ ఆర్టికల్ చదవండి.
రాత్రి తిన్న తర్వాత గిన్నెలు అలాగే పెట్టడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. రాత్రి మాత్రమే కాదు ఉదయం గిన్నెలు రాత్రి వరకు తోమకుండా ఉన్నా కూడా ప్రమాదమేనట. గిన్నెలను ఎక్కువ సేపు తోమకుండా అలాగే ఉంచడం వల్ల వాటి మీద చాలా బ్యాక్టీరియా చేరుతుంది. ఈ బ్యాక్టీరియా సింకు నుంచి ఇతర సామాగ్రి మీదకు తినే ఆహార పదార్థాల వరకు కూడా చేరుతుంది. అందుకే రాత్రి అయినా పగలు అయినా సరే ఎక్కువ సేపు గిన్నెలను సింకులో అలాగే వదిలేయకుండా తోమాలి.
వెంటనే గిన్నెలు తోమడం వల్ల మీరు బ్యాక్టీరియా వ్యాప్తిని తెలియకుండానే అరికట్టవచ్చు. రాత్రి సబ్బులో, నీటిలో నానబెట్టి ఉదయం తోమడం సులభం అనుకుంటారు. కానీ స్టీల్ పీస్ తో తోమడం వల్ల ఎంతటి మొండి మరకలు అయినా తొలిగిపోతాయి. గిన్నెలకు గీతలు పడతాయి అని ఆలోచిస్తే అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే నానబెట్టి చిన్న చిన్న సూక్ష్మజీవులను వంట గదిలో వ్యాప్తి చెందకుండా తోమడం ఉత్తమం.
ఈ సూక్ష్మజీవులు మురికి పాత్రలు, సబ్బు నీటిలో త్వరగా వ్యాప్తి చెందుతాయట. వీటి వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు మరిన్ని వ్యాధులకు కూడా కారణం అవుతాయి ఈ మురికి గిన్నెలు. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ వంట గదిని శుభ్రంగా ఉంచుకుంటే మీకు పాజిటివ్ గా అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటారు. సో మీ సింకులో గిన్నెలు ఉంటే ఆలస్యం చేయకుండా వెళ్లి ఇప్పుడే తోమేసేయండి.