Anant Ambani : అనంత్ అంబానీ.. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు. ఆయన కంపెనీలలో ఒక డైరెక్టర్. వంతారా అనే జంతు సంరక్షణ కేంద్రానికి ఓనర్.. త్వరలో రాధిక మర్చంట్ కు కాబోయే భర్త.. ప్రస్తుతం మూడు రోజుల ముందస్తు పెళ్లి వేడుకల్లో సందడి చేస్తున్నాడు. అలాంటి అనంత్ చూడ్డానికి భారీగా ఉంటాడు. గతంలో బరువు తగ్గినప్పటికీ.. అతడి అనారోగ్య పరిస్థితుల వల్ల మళ్లీ పెరిగాడు. అతడు ఆగర్భ శ్రీమంతుడి కొడుకు కాబట్టి ఎలా ఉన్నా చల్తానే.. కానీ ఆనంత్ భారీ కాయుడే కావచ్చు. అతడి మనసు మాత్రం వెన్న.. ఇటీవల వంతారా ఏర్పాటుకు ముందు ఎలాంటి పరిస్థితులను తాను ఎదుర్కొన్నాడో చెప్పినప్పుడు దేశం మొత్తం ఫిదా అయింది. ఇప్పుడు మూడు రోజుల ముందస్తు పెళ్లి వేడుకల్లో అతడు చేసిన వ్యాఖ్యలు ముఖేష్ అంబానీ ని కన్నీరు పెట్టించాయి.
జామ్ నగర్ లో ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ మూడు రోజుల ముందస్తు పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరైన ఈ వేడుక అత్యంత వైభవంగా జరుగుతోంది. ఇంత సందడిగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అనంత్ అంబానీ మాట్లాడిన మాటలతో ముకేశ్ అంబానీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. “నా కుటుంబం నన్ను చాలా ప్రత్యేకంగా చూసింది. నాకు ప్రత్యేకమైన స్థానం కల్పించింది. నేను ఆగర్భ శ్రీమంతుడైన కొడుకునైనప్పటికీ.. నా జీవితం పూల పాన్పు కాదు. ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చిన్నప్పటి నుంచి అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. జీవితం మొత్తం నాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో నాకు జన్మనిచ్చిన మా అమ్మానాన్న అండగా ఉన్నారు. నేను ఇబ్బంది పడకుండా ఏమేం చేయాలో అవన్నీ సమకూర్చారు. ఇవన్నీ ఇంతలా జరుగుతున్నాయి అంటే దానికి మా అమ్మ కారణం. ఆమె గత కొద్ది రోజులుగా రోజుకు 18 గంటల పాటు పనిచేస్తోంది. అమ్మా నాకు ఇవన్నీ చేసినందుకు నీకు థాంక్స్” అంటూ అనంత్ వ్యాఖ్యానించాడు.
రాధిక తన భార్యగా రావడాన్ని తన అదృష్టంగా అనంత్ పేర్కొన్నాడు. అనంత్ మాట్లాడుతున్నంత సేపు ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు వస్తుంటే ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.. అనంత్ అంబానికి ఉన్న అనారోగ్య సమస్యల నేపథ్యంలో అతని కుటుంబం అండగా నిలిచిందని కొనియాడారు. డబ్బున్నంతమాత్రాన కష్టాలు ఉండవని అందరూ అనుకుంటారని.. కానీ దానికి అనంత్ జీవితమే ఒక ఉదాహరణ అని వారు చెబుతున్నారు.
Mukesh Ambani got emotional when Anant Ambani mentioned about his health issues. pic.twitter.com/ThgBaQjeDZ
— News Arena India (@NewsArenaIndia) March 2, 2024