Motorola Razr Fold: కాలం మారుతున్న కొద్ది వినియోగదారుల అభిరుచుల్లో అనేక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కీప్యాడ్ ఫోన్ కొనుగోలు చేసిన వారు ఇప్పుడు స్మార్ట్ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందిన కొద్దీ ఈ స్మార్ట్ ఫోన్ కూడా కొత్తగా వస్తుంది. నేటి తరం వారు స్మార్ట్ ఫోన్స్ సైతం డిస్ప్లే పెద్దగా ఉండేలా కోరుకుంటున్నారు. ఇలాంటి వారికి ఫోల్డబుల్ మొబైల్స్ అనుకూలంగా ఉండనున్నాయి. ఇప్పటికే Samsung, Google వంటి కంపెనీలు ఫోల్డబుల్ మొబైల్స్ తో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు Motorola సైతం ఇలాంటి మొబైల్ ను తీసుకురావడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే దీనిని జనవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ప్రదర్శించారు. అప్పటినుంచి దీనిపై ఆసక్తిగా చర్చ సాగుతోంది. అయితే కొందరు సోషల్ మీడియాలో ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో చర్చించుకుంటున్నారు. ఓ నిపుణుడు తెలిపిన ప్రకారం ఈ ఫోన్ ఫీచర్స్, బ్యాటరీ వ్యవస్థ గురించి లీక్ అయినట్లు తెలుస్తోంది.. ఇంతకీ ఈ foldable మొబైల్ ఎలా ఉంటుందంటే..?
ప్రముఖ కంపెనీ Motorola నుంచి ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు Foldable ఫోన్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ కంపెనీ నుంచి Motorola Razr Fold రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే దీని గురించి కొందరు ప్రత్యేకంగా చెబుతున్నారు. ఇది మార్కెట్లోకి రానప్పటికీ దీనిపై విపరీతంగా చర్చ సాగుతోంది. రాబోయే ఈ ఫోల్డబుల్ మొబైల్ 6.6 అంగుళాల POLED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇన్నర్ డిస్ప్లే 8.1 అంగుళాలు ఉండనుంది. 6200 nits బ్రైట్నెస్ తో పని చేసే ఈ డిస్ప్లే ఇలాంటి వాతావరణం లోనైనా ప్రకాశవంతంగా ఉంటుంది.
ఈ ఫోల్డబుల్ మొబైల్ లో సాఫ్ట్వేర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో Qualcomm Snapdragon 8 Gen 5 ఉండనుంది. దీనితోపాటు 16 GB Ram, 512 GB స్టోరేజ్ కలిగి ఉండడంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసే వారికి ఇది అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఈ మొబైల్ లో బ్యాక్ సైడ్ నాలుగు కెమెరాలు ఉంటాయి. వీటిలో 50 MP మెయిన్ కెమెరా ఉండగా..50 MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. 32 MP ఫ్రంటు తో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. ఈ కెమెరా లతో 8K Resolution తో వీడియోలు తీసుకోవచ్చు. ఇందులో బ్యాటరీ వ్యవస్థ కూడా మామూలుగా లేదు. 6000 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 80 W వైర్డ్ చార్జర్.. 50 W వైర్లెస్ చార్జర్ తో సపోర్ట్ చేస్తుంది. అయితే దీని ధర గురించి ప్రత్యేకంగా చెప్పనప్పటికీ ఇప్పటివరకు ఉన్న సాంసంగ్ గెలాక్సీ Z Fold 7 ధర 1,999 డాలర్లుగా ఉంది. Motorola Fold మొబైల్ కూడా అదే ధరలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.