Motorola new phones: Motorola మొబైల్స్ భారత్ లో అత్యధిక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ కంపెనీ నుంచి కొన్ని రోజుల కిందట మార్కెట్లోకి వచ్చిన ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ను ఎగబడి కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కంపెనీ ఇక్కడితో ఆగకుండా ఈ సీరీస్ లో మరో మూడు మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఎక్స్ ఖాతాలో ఫోస్ట్ చేయబడింది. దీంతో మోటరోలా మొబైల్స్ కొనాలని చూసేవారికి ఇది గుడ్ న్యూస్ అని అంటున్నారు. ఇంతకీ ఆ మూడు మోడల్స్ ఏంటీ? ఇవి ఎలా ఉండబోతున్నాయి?
మోటారొలా ఎడ్జ్ కంపెనీకి చెందిన టిప్ స్టర్ ఇవాన్ బ్లాస్ (@evleaks)ఎక్స్ ఖాతాలో త్వరలో మూడు కొత్త మొబైల్స్ వస్తున్నట్లు పోస్ట్ చేశాడు. వీటిలో ఒకటి మోటరోలా ఎడ్జ్ 70 ప్రో, మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్, మోటరోలా 70 ప్రో లైట్ అనే మోడల్స్ రాబోతున్నాయి. ఇవి టెర్రైన్, టెర్రైన్ ప్లస్, టెర్రైన్ లైట్ తో తయారు చేయబడుతున్నాయి. ఈ మూడు మొబైల్స్ ఇటీవల ప్రారంభించిన మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ లల్లో చేరుతాయి.
ఇప్పటికే మోటరోలా నుంచి ఎడ్జ్ 70 ఫ్యూజన్ మార్కెట్లోకి వచ్చి అలరిస్తోంది. ఇందులో ఉండే ఫీచర్స్ వచ్చే కొత్త మొబైల్స్ లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మోటరోలా నుంచి ఎడ్జ్ 70 ఫ్యూజన్ ధర రూ.29,999 తో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.32,999 తో విక్రయిస్తున్నారు. కొత్త మొబైల్ కూడా అంతే ధరతో విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే రాబోయే కొత్త మూడు మొబైల్స్ లో 6.8 అంగుళాల డిస్ ప్లే ఉండనుంది. ఇది 1.5 కె రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇది 7ఎస్ జెన్ 4 చిప్ సెట్ తో ఉండడంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసుకోవచ్చని కొందరు చెబుతున్నారు. అలాగే ఇందులో 5,200 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది రోజూవారీ వినియోగదారులకు బాగా సపోర్టు చేస్తుంది. ఈ మూడు ఫోన్లలో ఒకటి ఫోల్డబుల్ ఫోన్ ఉంటుందని చెబుతున్నారు. ఇవి 8 జీబీ నుంచి 12 జీబీ ర్యామ్ వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే 256 జీబీ నుంచి 1 టీబీ స్టోరేజ్ వరకు కెపాసిటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
