Motorola Mobile: కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. దీంతో రోజుల పాటు చేయాల్సిన కొన్ని పనులు క్షణాల్లో పూర్తవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మొబైల్ అని చెప్పవచ్చు. మొబైల్ రంగలోకి వచ్చిన తరువాత అన్నీ మారిపోయాయి. దీంతో ఆ మొబైల్ ప్రస్తుతం కీలకంగా మారింది. ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ ఉంటోంది. అయితే చాలా మంది మార్కెట్లోకి వచ్చే కొత్త మొబైల్ ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కానీ ఇవి ఎక్కువ ధరను కలిగి ఉంటున్నాయి. తాజాగా ఓ మొబైల్ లేటేస్ట్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. దీని ధర కూడారూ. 6 వేల లోపే ఉండడం విశేషం. ఇంతకీ ఆ మొబైల్ ఏదో తెలుసుకుందామా..
మొబైల్ రంగంలో MOTOROLA ది ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఎన్నో మోడళ్లు ఆదరించాయి. లేటేస్టుగా అప్డేట్ ఫీచర్స్ తో మార్కెట్లోకి ఓ మొబైల్ వచ్చింది. దీనికి ‘మోటారొలా జీ04’ అని పేరు పెట్టారు. స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ కారణంగా కొన్ని మొబైల్స్ ధరలు తగ్గాయి. వీటిలో మోటారొలాకు చెందిన జీ4 ఉంది. ఈ మొబైల్ ధర తక్కువగా ఉండడంతో పాటు బ్యాంకు కార్డు ద్వారా తీసుకోవడం వల్ల మరింత తక్కువగా వస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..
మోటారొలా జీ04 ఫీచర్స్ విషయానికొస్తే 6.6 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే తో పాటు ఇంటర్నల్ మెమొరీ 1 టీబీ వరకు ఉండనుంది. ఇందులో 5000 ఎంహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇందులో 16 మెగా పిక్సెల్ తో కూడిన రెయిర్ కెమెరా , 5 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంది. దీని ధర రూ.6,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్డు ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే 30 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఎస్ బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు కు చెందిన క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ వస్తుంది. దీంతో ఈ ఫోన్ ను రూ.5999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే పాత మోటారొలాను తీసుకొస్తే రూ.6,450కే ఇస్తారు.