Motorola Edge Premium 5G: ప్రముఖ కంపెనీ Motorola ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తుంది. వినియోగదారుల అభిరుచులు, సంవత్సరాలు మారిపోతుండడంతో పాటు.. లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కువగా కోరుకుంటూ ఉండడంతో వారికి అనుగుణంగా కొత్త మోడల్స్ ను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ కొత్తగా Edge Premium 5G అనే మొబైల్ ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే దీని గురించి ఇప్పటికే ఆన్లైన్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఫ్లాగ్ ఫిష్ వంటి మొబైల్స్ ను ప్రవేశపెట్టిన ఈ కంపెనీ కొత్తగా 150 w ఆల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ అవకాశాన్ని ఇందులో ఇవ్వబోతుంది. అంతేకాకుండా ఈ మొబైల్ డిజైన్, బ్యాటరీ పనితీరు ప్రత్యేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Motorola Edge Premium 5G మొబైల్ డిస్ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో QHD +తో కలిగిన AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది స్పష్టమైన రంగులతో విజువల్స్ ను అందిస్తుంది. మూవీస్ చూసే వారితోపాటు గేమింగ్ కోరుకునేవారు ఈ డిస్ప్లే తో మంచి అనుభవాన్ని పొందుతారు. అంతేకాకుండా ఇది బిగ్ స్క్రీన్ కావడంతోపాటు ఆల్ట్రా క్లియరెన్స్ డిస్ప్లే ఉండడంతో స్పష్టమైన రంగులతో వీక్షించవచ్చు. ఈ మొబైల్ లో ఐ హేండ్ ఫ్లాగ్ ఫిష్ ప్రాసెసర్ ఉండనుంది. అలాగే RAM పనితీరు కూడా మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో ప్రొఫెషనల్ కోసం మొబైల్ వాడే వారితోపాటు గేమింగ్ కోరుకునేవారు ఈ ప్రాసెసర్ తో మంచి అనుభవాన్ని పొందుతారు. అలాగే ఇందులో స్టోరేజ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Lenovo నుంచి కొత్త టాబ్లెట్.. గేమింగ్ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్..
ప్రస్తుత కాలంలో ప్రతి మొబైల్ కొనుగోలుదారుడు కోరుకునేది నాణ్యమైన కెమెరా. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఎడ్జ్ ప్రీమియం 5జి మొబైల్ లో 350 MP మెయిన్ కెమెరా ఉండనుంది. ఈ కెమెరా AI ఆదారిత స్నాప్స్ ను అందిస్తుంది. ఆప్టిమైజ్ చేసిన కలర్స్ తో ఫోటోలతో పాటు వీడియోలను రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇందులో బ్యాటరీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఐ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ బ్యాటరీ 150 W ఫాస్టెస్ట్ చార్జింగ్‌తో పనిచేసే అవకాశం ఉంది. నిమిషాల్లోనే 100% పూర్తయి కెపాసిటీ దీనికి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బిజీగా ఉండే వారితోపాటు.. రోజంతా మొబైల్ వినియోగించే వారికి ఈ బ్యాటరీ లైఫ్ సరిపోతుందని తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్లో 5జి కనెక్టివిటీ, వైఫై, బ్లూటూత్ తో పాటు జిపిఎస్ వంటి ఫీచర్లు యూత్ తో పాటు రోజువారి అవసరాలకు చాలా వరకు ఉపయోగపడతాయి. త్వరలోనే దీని ధర కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.