Motorola Edge 80 Ultra: Motorola మొబైల్స్ అంటే ప్రత్యేకంగా ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. వినియోగదారులకు అనుగుణంగా ఈ కంపెనీ డిఫెరెంట్ ఫోన్లను తీసుకొస్తుంది. ఇప్పటికే మోటరోలా ఎడ్జ్ 60,70 తో అలరించింది. ఇప్పుడు Motorola Edge 80 ultra తో ఆకట్టుకోనుంది. దీనికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో ఉంచారు. ఈ మొబైల్ ఫీచర్లు పరిశీలిస్తే గేమింగ్ కోరుకునే వారితో పాటు రోజువారి వినియోగదారులకు అనుగుణంగా ఉండేవిధంగా తయారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే మల్టీ టాస్కింగ్ యూజర్స్ కు కూడా ఇది చాలావరకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ మొబైల్ డిస్ప్లే, ఇతర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Motorola Edge 80 ultra డిస్ప్లే వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఈ మొబైల్లో అత్యధిక resolution తో కూడిన POLED డిస్ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ డిస్ప్లే HDR సపోర్ట్ చేయనుంది. దీంతో స్మూత్ స్క్రోలింగ్ చేసే వారికి.. గేమింగ్ కోరుకునే వారికి అనుగుణంగా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. అలాగే దీనిపై రక్షణగా శాండ్ విచ్ గ్లాస్ నిర్మాణాన్ని చేపట్టారు. దీని ఫ్రేమ్ కూడా దృఢంగా ఉండడంతో ఒక్కోసారి కింద పడినా కూడా ఎలాంటి డామేజ్ కాకుండా ఉంటుంది. ఇందులో 300 MP మెయిన్ కెమెరాను అమర్చారు. అలాగే ఇదే మెగాపిక్సల్ తో అల్ట్రా హై రిజల్యూషన్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు కోరుకునే వారికి కూడా అద్భుతమైన ఫోటోగ్రఫీ అందిస్తుంది. అడిషనల్ లెన్స్ తో పాటు ఆల్ట్రా వైట్ షాట్, డెప్తు బెస్ట్ పోర్ట్రైట్ కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు కోరుకునే వారికి కూడా అద్భుతమైన స్నాప్ ను అందిస్తుంది.
ఈ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 988 చిప్ సెట్ ను అమర్చారు. ఇది శక్తివంతమైన ప్రాసెసర్ కూడా కావడంతో హై హేండ్ గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్ కోసం వాడే వారికి అనుగుణంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో 12 GB రామ్ ఉండడంతో వేగంగా పనులు చేసుకోవచ్చు. ఈ మొబైల్లో బలమైన బ్యాటరీని చేర్చారు. ఇందులో 8300 mAh బ్యాటరీ ఉండగా.. ఇది ఎలాంటి అంతరాయం లేకుండా రోజంతా వచ్చేలా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీనికి ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయడంతో బిజీగా ఉండే వారికి తొందరగా చార్జింగ్ చేసుకోవాలని అనుకునే వారికి సపోర్ట్ ఇస్తుంది. ఈ బ్యాటరీ ఉష్ణోగ్రత పర్యవేక్షణతో పాటు ఓల్టేజ్ నియంత్రణ సెట్ చేసుకుంటుంది. ఇక ఇందులో వైఫై కనెక్టివిటీ, బ్లూటూత్ వంటి ఆప్షన్లు అనుకూలంగా ఉంటాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కావలసిన వారికి ఉపయోగపడుతుంది.