Motorola Edge 70 Pro: ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola మరో రెండు కొత్త ఫోన్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ తో అందరి ప్రశంసలు పొందిన ఈ కంపెనీ 2026 ఏప్రిల్ నెలలో Motorola Edge 70 Pro, Motorola Edge 70 Pro Plus అనే రెండు మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫీచర్లు ఇప్పటికే ఆన్లైన్లో ప్రదర్శన చేశారు. అయితే ఇందులో ఉండే కెమెరా, బ్యాటరీ పనితీరుపై ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. వీటితోపాటు ధర ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
Motorola Edge 70 Pro మొబైల్లో 6.7 అంగుళాల డిస్ప్లే ఉండనుంది. ఇందులో Qualcomm స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ ఉండనుంది. అలాగే ఇందులో 50 మెగాపిక్సల్ తో కూడిన ప్రధాన కెమెరా, 10 ఎంపీ టెలిఫోటో, 50 MP ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం సెట్ చేశారు. ఇందులో 6500 mAh బ్యాటరీ ఉండగా ఈ బ్యాటరీ 100 వార్డ్ ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ 2026 మే లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో దీని ధర రూ.31,999 నుంచి రూ.35,000 వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే Motorola Edge 70 Pro Plus వివరాల గురించి బయటకు తెలియ రాలేదు.Motorola Edge 70 Pro మొబైల్స్ కు సంబంధించిన లీకులు రావడంతో చాలామంది మీ మొబైల్ గురించి ఇంప్రెస్ అవుతున్నారు.
ఇప్పటికే మోటోరోలా నుంచి ఎన్నో రకాల మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే కొత్తగా వచ్చే ఈ మొబైల్ పై ఆసక్తి పెరిగింది. ఇవి స్పాట్ లుక్ తో పాటు.. ఆకర్షణ ఏమైనా డిజైన్లు కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే సెల్ఫీ కోరుకునే వారికి ఈ మొబైల్ బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో వీడియో కాల్స్ తో చాలామంది కరెక్ట్ అవుతున్నారు. ఇలాంటి వారికి కూడా ఇందులో ఉండే కెమెరా అద్భుతంగా పనిచేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మూవీస్ చూసేవారికి ఇందులో ఉండే డిస్ప్లే సపోర్ట్ గా ఉండనుంది.