Motorola Edge 70 Pro : Motorola కంపెనీకి చెందిన మొబైల్స్ కు ఎప్పుడూ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. అయితే వినియోగదారుల అవసరాలను, అభిరుచులకు తగిన విధంగా కొత్త కొత్త మోడల్స్ ను ఈ కంపెనీ తీసుకువస్తుంది. ఇందులో భాగంగా మోటరోలా నుంచి త్వరలో Edge 70 Pro మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే దీని నుంచి వచ్చిన మొబైల్స్ కంటే ఈ కొత్త ఫోన్లో ఫీచర్స్ ప్రత్యేకంగా ఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే కెమెరా నాణ్యత, బ్యాటరీ వ్యవస్థ నేటితరం వారికి అనుగుణంగా ఉంటుందని అంటున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్లను మార్కెట్లో రిలీజ్ చేశారు. మొబైల్ మార్కెట్లోకి రాకముందే ఫీచర్లు తెలియడంతో చాలామంది వినియోగదారులు దీనిని కొనేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఈ మొబైల్స్ పూర్తి వివరాలు లోకి వెళ్తే..
Motorola Edge 73 Pro డిస్ప్లే వేరే లెవెల్ అని అనుకోవచ్చు. ఇప్పటివరకు మోటరోలా మొబైల్స్ లో చూడని డిస్ప్లే ఇందులో చూడొచ్చు. ఈ మొబైల్ లో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లేను అమర్చారు. ఈ డిస్ప్లే 1.5 K Resolution తో పనిచేస్తుంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో ఉండి 5200 Nits బ్రైట్నెస్ ను అందిస్తుంది. దీంతో ఎలాంటి వాతావరణంలో నైనా అద్భుతమైన కాంతిని అందిస్తూ ఉంటుంది. ఈ కొత్త మొబైల్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ ఉండగా.. దీనికి 12 GB రామ్ సపోర్ట్ చేస్తుంది. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూజ్ చేసే వారికి ఈ ఫోన్ బాగా పనిచేస్తుంది.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారికి ఈ మొబైల్ లో ఉండే కెమెరా సపోర్టుగా ఉండనుంది. ఇందులో 50 మెగాపిక్సల్ సోనీ LYT మెయిన్ కెమెరా ఉండనుంది. ఇందులో 50 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు. అలాగే వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటే 4K Resolution క్వాలిటీని అందిస్తుంది. ఈ మొబైల్లో బ్యాటరీ వ్యవస్థ కూడా మెరుగ్గానే ఉంది. ఇందులో 6500 mAh బ్యాటరీ ఉండగా.. దీనికి 90 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్వేర్ ఉన్న ఈ మొబైల్ కు మూడు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ ను గ్యారెంటీ ఇవ్వనున్నారు.
మోటోరోలా ఎగ్జిట్ 70 ప్రో మొబైల్ ను ఏప్రిల్ 22న లాంచ్ చేయనున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే ధర రూ.30,000 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలు, ఏమైంది కోరుకునే యూత్ కు ఈ ఫోన్ సపోర్ట్ గా ఉండనుంది.